BREAKING
వినాయక ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ ‘దేవరాయ’గా కిచ్చా సుదీప్ రాయల్ ఎంట్రీ.. శ్రీకృష్ణదేవరాయ అవతార్‌లో అదరగొట్టిన అభినయ చక్రవర్తి! ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు రండి రాజనాథ్ సింగ్ కు సీఎం రేవంత్ ఆహ్వానం పవన్ కల్యాణ్ 55వ బర్త్‌డే గ్రాండ్ సెలబ్రేషన్.. మోదీ నుంచి చిరంజీవి వరకు స్పెషల్ విషెస్! తెలంగాణలో మరో సంచలనం - KCR ఫ్యామిలీలో చీలిక - కవిత సొంత పార్టీ గిరిజనుల జీవితాలతో ఆటలాడుతున్న జగన్‌.. పుట్టిన రోజునాడు పవన్ ఎక్కడ ? ఏపీ అసెంబ్లీలో హై వోల్టేజ్ డ్రామా - TTD లడ్డూ కల్తీ నుండి ఫ్రీ బస్సు వరకు - గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సెషన్ షురూ! వై ఎస్ కు సీఎం రేవంత్ ఘన నివాళి తెలంగాణలో ఓటర్ లిస్ట్ కలకలం - 73 లక్షల ఓట్లు గల్లంతు? - కాంగ్రెస్ vs ఎలక్షన్ కమిషన్ వార్! దివ్యాంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలి. జిల్లా కలెక్టర్ ఏపీలో ఎలక్షన్ ఫీవర్ - పంచాయతీ పోరుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ - 13 వేల పంచాయతీల్లో హై వోల్టేజ్ డ్రామా! బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

తెలంగాణలో మరో సంచలనం - KCR ఫ్యామిలీలో చీలిక - కవిత సొంత పార్టీ

Select Suryaa Now
తెలంగాణలో మరో సంచలనం - KCR ఫ్యామిలీలో చీలిక - కవిత సొంత పార్టీ

తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ - కవిత కొత్త పార్టీతో కదనరంగంలోకి!రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గారాలపట్టి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇకపై తనదైన శైలిలో, తనదైన ఎజెండాతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఎందుకు ఈ నిర్ణయం?గత కొంతకాలంగా BRS లో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని, తన సలహాలు, సూచనలను పట్టించుకోవడం లేదని కవిత అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసు తర్వాత పార్టీలో తన పాత్ర తగ్గిపోయిందని భావించిన ఆమె, చివరకు సొంత పార్టీ పెట్టడమే మార్గమని భావించినట్లు తెలుస్తోంది."తెలంగాణ రాష్ట్ర సేన" - పేరులోనే పవర్!కవిత కొత్తగా పెట్టబోయే పార్టీ పేరు "తెలంగాణ రాష్ట్ర సేన" (TRS). ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు KCR పార్టీ పేరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) గానే ఉండేది. ఇప్పుడు కూతురు అదే సెంటిమెంట్ తో "సేన" అనే పేరును ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.పార్టీ ఎజెండా ఏంటి?తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంమహిళా సాధికారత, బీసీలకు పెద్దపీటతెలంగాణ జాగృతి ద్వారా చేసిన పోరాటాలను కొనసాగించడంత్వరలోనే హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, పార్టీ జెండా, అజెండాను అధికారికంగా ప్రకటించనున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.KCR కుటుంబంలో చీలిక తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మారుస్తుందో, ఈ కొత్త సేన ఎవరికి లాభం, ఎవరికి నష్టం చేస్తుందో చూడాలి.