BREAKING
ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ నేపాల్ చిలిమే సొరంగం క్లియరెన్స్‌లో ముమ్మరంగా భారత బృందాల యత్నాలు పోలీస్ సంస్మరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

జనసేన యువజన విభాగంగా ‘జై కొట్టు’ ఆవిర్భావం

Select Suryaa Now
జనసేన యువజన విభాగంగా ‘జై కొట్టు’ ఆవిర్భావం

ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి:

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీలో మరో కీలక అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వేదికగా జనసేన పార్టీ యువజన విభాగాన్ని ‘జై కొట్టు’ పేరుతో ప్రారంభించారు. రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. యువతలో ఉత్సాహం, స్ఫూర్తిని నింపేలా ప్రత్యేకంగా రూపొందించిన ‘జై కొట్టు’ గీతాన్ని కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందించారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కేరళలో ఉన్నందున ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన తన సందేశాన్ని ఆడియో రూపంలో పంపించారు. యువతను పార్టీ కార్యకలాపాల్లో మరింత చురుకుగా భాగస్వామ్యం చేయడంతో పాటు, రాజకీయాల్లో వారికి ప్రత్యేక స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ‘జై కొట్టు’ యువజన విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.యువత శక్తిని సానుకూలంగా వినియోగించుకోవడం, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువతను భాగస్వాములను చేయడం ఈ విభాగం ప్రధాన లక్ష్యాలుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.