BREAKING
అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ నేపాల్ చిలిమే సొరంగం క్లియరెన్స్‌లో ముమ్మరంగా భారత బృందాల యత్నాలు

కాంగ్రెస్ పార్టీ హామీల మోసాలపై.. బిఆర్ఎస్ పోరుబాట

Select Suryaa Now
కాంగ్రెస్ పార్టీ హామీల మోసాలపై..  బిఆర్ఎస్ పోరుబాట

నిరసన ప్రదర్శన చేసిన గులాబీ దళం

హామీలు నెరవేర్చాలని తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

మణుగూరు ఆర్ సి సూర్య(మేజర్ న్యూస్); కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ..మణుగూరు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ...బిఆర్ఎస్ కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు హామీలను నెరవేర్చకుండా కాలం వెళ్ళదీస్తున్నారని ఆరోపించారు.పార్టీ పిలుపు మేరకు బుధవారం నుండి ఈ నెల 8 వ తేదీ వరకు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాలతో గులాబీ శ్రేణులు పోరుబాట పట్టారు.

నియోజకవర్గ పరిధిలోని మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం మండలాల నుండి వచ్చిన గులాబీ దళం భారీ ప్రదర్శన నిర్వహించారు.తహశీల్దార్ కార్యాలయం ఎదుట కొద్దిసేపు ధర్నా నిర్వహించిన అనంతరం రెవిన్యూ అధికారులకు కాంగ్రెస్ హామీ మోసాలపై వినతి పత్రం సమర్పించారు.బిఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు.