BREAKING
ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ నేపాల్ చిలిమే సొరంగం క్లియరెన్స్‌లో ముమ్మరంగా భారత బృందాల యత్నాలు పోలీస్ సంస్మరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

1.11 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్

Select Suryaa Now
1.11 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్

 

 


 సూర్య కరీంనగర్ ప్రతినిధి: కరీంనగర్ రూరల్ పోలీసులు ఇరుకుల్ల గ్రామ శివారులోని సమ్మక్క గద్దెల సమీపంలో తనిఖీలు నిర్వహించి 1 కిలో 11 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో బెజ్జంకి ప్రేమ్ కుమార్ (28)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, అతనితో ఉన్న కాశిపాక నవీన్ (23) పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
విశ్వసనీయ సమాచారం మేరకు రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ ఏ. లక్ష్మారెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించిన ఇద్దరు వ్యక్తులు పారిపోగా, ప్రేమ్ కుమార్‌ను పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగులో 1.11 కిలోల గంజాయి, బైక్, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నవీన్ గంజాయిని తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు ప్రేమ్ కుమార్ తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నవీన్‌ను త్వరలో పట్టుకుని గంజాయి సరఫరా మూలాలను వెలికితీస్తామని తెలిపారు.
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ అభినందించారు.