వైద్య కళాశాల, జీజీహెచ్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యం. మంత్రి దామోదర్ రాజనర్సింహ
వైద్య కళాశాల, జీజీహెచ్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యం.
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి,/ పుల్కల్ ; ప్రభుత్వ మెడికల్ కళాశాల, జీజీహెచ్, నర్సింగ్ కళాశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించి ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ నెల 17న సంగారెడ్డి నర్సింగ్ కళాశాల, హాస్టల్, మెడికల్ కళాశాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. జీజీహెచ్‌లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, పారిశుద్ధ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సింగూర్ కాలువల లైనింగ్, కట్ట మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. બેઠકలో అదనపు కలెక్టర్ పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, వైద్య, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు పాల్గొన్నారు.