BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి

Select Suryaa Now
పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి

సర్పంచ్ సుతారి రమాదేవి, మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య 

ఆళ్లపల్లి సూర్య మేజర్ న్యూస్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం మండల పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్ సుతారి రమాదేవి, మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ పడిగ సమ్మయ్య డాక్టర్ వైఎస్ ఆర్ సేవలను కొనియాడుతూ,వైఎస్ఆర్ ఒక వ్యక్తి కాదు... ఒక శకం అని పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని అన్నారు.

 ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, జలయజ్ఞం లాంటి ఎన్నో పథకాలతో తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని. ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీనే ముందుకు  తీసుకెళ్లిందని అన్నారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రైతుల అభ్యున్నతికి ప్రత్యేకంగా కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు.నేటి యువతకు వైఎస్ఆర్ ఆదర్శప్రాయుడని,వారి ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో సర్పంచులు రామనర్సయ్య,చంద్రశేఖర్, సూర్యకాంత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి వెంకన్న,కాంతు, సుతారి కృష్ణ,చిరంజీవి, వెంకటాచారి,ఉపసర్పంచ్ వగలబోయిన సతీష్, శ్రీకాంత్,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఇనుముల ఇందు కుమార్,కీసరి లాల్,వేణు,వార్డు మెంబర్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.