BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

మ్యాజిక్కా.... మజాకానా పుష్పక విమానాన్ని తలపిస్తున్న టాటా మ్యాజిక్ లు

Select Suryaa Now
మ్యాజిక్కా.... మజాకానా  పుష్పక విమానాన్ని తలపిస్తున్న టాటా మ్యాజిక్ లు

ప్రయాణికుల భద్రతను పట్టించుకోని డ్రైవర్లు 

కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్న వైనం 

చర్ల,సూర్య(మేజర్ న్యూస్):

చర్ల మండలంలో వ్యవసాయ కూలి పనులకు వెళ్లే ఆదివాసీలను పని ప్రదేశం నుండి వారి గ్రామం వరకు చేరవేస్తున్న టాటా మ్యాజిక్ యజమానులు, డ్రైవర్లు వ్యవసాయ కూలీల భద్రతను ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. తమకు ఎక్కువ కిరాయి వస్తుందనే ఆశతో వ్యవసాయ కూలీలను మ్యాజిక్ టాప్ పైన, వెనుక భాగంలో కూడా ఎక్కించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

 పుష్పక విమానంలో ఎంత మంది ఎక్కిన మరొకరికి చోటు ఉంటుందని చందంగా టాటా మ్యాజిక్ నిర్వాహకులు వ్యవసాయ కూలీలను పరిమితికి మించి ఎక్కించుకొని వారి ప్రాణాలతో ఆటలాడుతున్నారు.

 కేవలం డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఆశతో ఇబ్బడి ముబ్బడిగా ప్రయాణికులను ఎక్కించుకొని అధిక వేగంతో వెళుతున్నారు. ఈ కారణం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆటోలు, టాటా మ్యాజిక్ లకు వాటి పరిమితికి లోబడి ప్రయాణికులను ఎక్కించుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ దానిని మీరు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ప్రయాణికుల (ఆదివాసీ వ్యవసాయ కూలీలు) ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. పై ఫోటోలో చూస్తే టాటా మ్యాజిక్ టాప్ పైన ఆదివాసీ యువతులు కూర్చుండగా, వెనుక మరికొందరు యువతులు వేలాడుతూ వెళ్తున్నారు. అయితే ఇంత లోడు ఉన్న టాటా మ్యాజిక్ వాహనం అత్యధిక వేగంతో మండల కేంద్రంలో రోడ్లపై వెళ్తుండడం గమనార్హం.

 రవాణా శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి అధిక లోడుతో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న టాటా మ్యాజిక్ ల యజమానులు, డ్రైవర్ల పై చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ కూలీలను తరలించే వాహనాల యజమానులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని మండల ప్రజలు కోరుతున్నారు.