BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

సర్పంచ్ కాదు నిజమైన ప్రజాసేవకురాలు

Select Suryaa Now
సర్పంచ్ కాదు నిజమైన ప్రజాసేవకురాలు

పార పట్టి రోడ్డు శుభ్రం చేసిన ప్రజాసేవకురాలు పగడాల రమాదేవి..

దమ్మపేట, సూర్య (మేజర్ న్యూస్) :  బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజా సమస్యలపై మెరుపు వేగంతో స్పందిస్తూ, నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున్న దమ్మపేట స్థానిక సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు సేవాతత్పరత, నిబద్ధత మరోసారి నిరూపితమయ్యాయి. నిగర్విగా, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ఆమె, తాజాగా మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఒక ప్రమాదకర సమస్యపై తక్షణమే స్పందించి తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రశంసలు అందుకున్నారు. ఎయిర్‌టెల్ టవర్ నుంచి మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లే రహదారిని మందుబాబులు అడ్డాగా మార్చుకుని, తాగి పారేసిన మద్యం సీసాలను రోడ్డుపైనే పగలగొట్టి ఉన్మాదం ప్రదర్శించారు. పవిత్రమైన ఆలయానికి వెళ్లే దారిలో, నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే మార్గంలో ఇలాంటి వికృత చేష్టల వల్ల కాలినడకన వెళ్లే భక్తులతో పాటు మూగజీవాల కాళ్లు తెగిపోయే ప్రమాదకర పరిస్థితి ఏర్పడటంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రంగంలోకి దిగారు.

సమాచారం అందుకున్న వెంటనే రమాదేవి గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాధారణంగా అధికారులు లేదా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి వదిలేసే సంస్కృతికి భిన్నంగా, ఆమె ప్రజల భద్రత కోసం తానే స్వయంగా చేతుల్లోకి పార తీసుకున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపై విస్తరించిన గాజు ముక్కలను స్వహస్తాలతో ఏరివేస్తూ పారిశుధ్య కార్మికురాలిగా మారిపోయారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఎలాంటి అహంభావం లేకుండా ఆమె స్వయంగా చెత్తను శుభ్రం చేయడం అక్కడి వారిని ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. ఆ తర్వాత పంచాయతీ సిబ్బందిని రంగంలోకి దించి, జెసిపి  యంత్రం సహాయంతో ఆ ప్రాంతంలో మిగిలిపోయిన వ్యర్థాలను, ప్రమాదకరమైన గాజు ముక్కలను పూర్తిగా ప్రక్షాళన చేయించారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తానే స్వయంగా శ్రమించి, ఆ దారినంతటినీ అద్దంలా శుభ్రం చేయించిన ప్రజాసేవకురాలు రమాదేవి సేవాతత్పరతపై దమ్మపేట ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా స్పందించి ఆదర్శంగా నిలిచిన ఆమె చొరవను మండలంలోని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఇలాంటి పవిత్ర స్థలాల్లో మద్యం తాగుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఆకతాయిల ఆటకట్టించాలని, వారిని గుర్తించి పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.