BREAKING
ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ నేపాల్ చిలిమే సొరంగం క్లియరెన్స్‌లో ముమ్మరంగా భారత బృందాల యత్నాలు పోలీస్ సంస్మరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

భార్యపై భర్త దాడి.. అడ్డువచ్చిన అత్తపైనా దాడి జ్యోతి మృతి.. అత్త ఎల్లవ్వ పరిస్థితి విషమం

Select Suryaa Now
భార్యపై భర్త దాడి.. అడ్డువచ్చిన అత్తపైనా దాడి  జ్యోతి మృతి.. అత్త ఎల్లవ్వ పరిస్థితి విషమం

 


సూర్య, ఎల్లారెడ్డిపేట:
భార్యపై భర్త దాడి చేయగా, అడ్డువచ్చిన అత్తపైనా దాడి చేసిన ఘటనలో భార్య మృతి చెందగా, అత్త తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పదిర గ్రామానికి చెందిన గండికోట ఎల్లవ్వ కుమార్తె జ్యోతికి ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన పల్లెపు సురేష్‌తో వివాహం జరిగింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో జ్యోతి తల్లిగారింటి వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి జ్యోతిపై భర్త సురేష్ దాడి చేసినట్లు, అడ్డువచ్చిన అత్త ఎల్లవ్వపై కూడా దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో జ్యోతి మృతి చెందగా, ఎల్లవ్వ తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. డీఎస్పీ, సీఐ, ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్లు తెలిపారు. అనంతరం జ్యోతి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి, తీవ్రంగా గాయపడిన ఎల్లవ్వను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.