BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

నా బర్తరఫ్‌ చెల్లదు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Select Suryaa Now
నా బర్తరఫ్‌ చెల్లదు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

కూతురు వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం ఎలా..?

అరవింద్‌ బీజేపీలో ఉంటే.. బండి సంజయ్‌ కాంగ్రెస్‌లో లేరా..?

పదేళ్లుగా సుస్మిత టికెట్‌ కోసం ప్రయత్నిస్తోంది.. కడియం తన కూతురికి టికెట్‌ ఇప్పించలేదా..?

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేసి మంత్రి పదవి నుంచి తొలగించడం చెల్లదని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తన వివరణ తీసుకోకుండా తనపై ఎలా చర్యలు తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు.

తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని సురేఖ ఇప్పటికే కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. తన ప్రమేయం లేని అంశంపై షోకాజ్‌ నోటీసు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. 

‘నా వివరణ తీసుకోకుండా బర్తరఫ్‌ ఎలా చేస్తారు?’ అంటూ సురేఖ అధిష్ఠాన నిర్ణయంపై ప్రశ్నించినట్లు సమాచారం. తన కూతురు వ్యాఖ్యల ఆధారంగా తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడం సరికాదని ఆమె వాదిస్తున్నట్లు తెలుస్తోంది.

టికెట్‌ అంశంపై సురేఖ ప్రశ్నలు

తన కుమార్తె సుస్మిత రాజకీయంగా ఎదగాలని కోరుకోవడంలో తప్పేముందని సురేఖ ప్రశ్నించినట్లు సమాచారం. “పదేళ్లుగా నా కూతురు టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తోంది.. కడియం తన కూతురిని ఎంపిక చేసుకోలేదా.. సుస్మిత టికెట్‌ అడిగితే తప్పేంటి?” అని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

పరకాల నియోజకవర్గంలో టికెట్‌ అంశమే తాజా వివాదానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది. సుస్మిత ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేగింది. 

‘అరవింద్‌ బీజేపీలో ఉంటే.. సంజయ్‌ కాంగ్రెస్‌లో లేరా?’

ఇక పార్టీ మార్పులు, కుటుంబ రాజకీయాల అంశాన్ని కూడా సురేఖ ప్రస్తావించినట్లు సమాచారం. “అరవింద్‌ బీజేపీలో ఉంటే.. బండి సంజయ్‌ కాంగ్రెస్‌లో లేరా?” అంటూ ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో కుటుంబ సభ్యులు లేదా బంధువుల రాజకీయ అనుబంధాలను చూపించి తనపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం.

మొత్తంగా సురేఖ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వివాదాన్ని మరింత తీవ్రం చేసేలా ఉన్నాయి. ఒకవైపు సుస్మిత వ్యాఖ్యలపై పార్టీ నేతలు చర్యలు కోరుతుండగా.. మరోవైపు తన వివరణ తీసుకోకుండా తనపై చర్యలు తీసుకోవద్దని సురేఖ గట్టిగా వాదిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి.