BREAKING
హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!! కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

మంత్రివర్గం నుంచి కొండా సురేఖ తొలగింపు!

Select Suryaa Now
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ తొలగింపు!

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయాలు 
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన, సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి కొండా సురేఖను తక్షణమే తొలగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆమెను బర్తరఫ్ చేయాలని కోరుతూ ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్‌కు అధికారిక సిఫార్సు లేఖను పంపింది. మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణతో పాటు పలు కీలక పదవుల్లో నియామకాలు, మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ప్రకటన విడుదల చేసింది.

కొండా సురేఖను మంత్రి పదవి నుండి తక్షణమే తొలగిస్తూ గవర్నర్‌కు సిఫార్సు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసింది. ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నూతన ఉపాధ్యక్షురాలిగా నియమించారు.

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా శ్రీమతి నెరెళ్ల శారద నియామకానికి సీఎం ఆమోదం తెలిపారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధా రాణిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.