BREAKING
గ్లోబల్ ఆటో రంగంలో భారత్ సరికొత్త రికార్డులు కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వానికి 1000 రోజులు. నేటి నుంచి మథురలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన గాంధారీ X రివ్యూ: నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన.. తాప్సీ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే? బెంగళూరులో 'ఏరో ఇండియా 2027' 20 వేల ఇళ్ల పునర్నిర్మాణం తప్పనిసరి, కొనసాగుతున్న గాలింపు జాతీయ భద్రతకు ఇంధన స్వయం సమృద్ధి అత్యంత కీలకం న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసిన 18వ 'బ్రిక్స్ ఐపీ' సమావేశం సెప్టెంబర్ మొదటి వారాంతంలో డిజిటల్ ప్లాట్ఫామ్లపై పలు ఆసక్తికరమైన సినిమాలు నా బర్తరఫ్‌ చెల్లదు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు ప్రపంచ వాణిజ్యంలో భారత్ దూకుడు కాంగ్రెస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం విజయ్ మంచి సీఎం కావాలి.. కాంగ్రెస్ అండగా ఉంటుంది మంత్రివర్గం నుంచి కొండా సురేఖ తొలగింపు! 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలంటూ.. 1,000 రోజుల్లో ప్రజలను నట్టేట ముంచారు: మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి..

కాంగ్రెస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం

Select Suryaa Now
కాంగ్రెస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం

నర్సాపూర్‌లో కాలువ పనుల పరిశీలనలో హరీష్ రావు
నర్సాపూర్: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టు పనులపై బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నాయకుడు, మాజీ మంత్రి టి. హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డితో కలిసి ఆయన నర్సాపూర్ ప్రాంతంలో నిలిచిపోయిన మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ పనులను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సాగునీటి కాలువ పనులు పూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు. కాలువ నిర్మాణాలు ఆగిపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణను, మిగిలిన పనులను పట్టించుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు.