BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

నేటి నుంచి మథురలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన

Select Suryaa Now
నేటి నుంచి మథురలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగస్వామ్యం
మథుర: రెండు రోజుల శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం మథుర చేరుకోనున్నారు. మథుర పరి పరిసర ప్రాంతాలైన బ్రజ్ భూమికి జన్మాష్టమితో అత్యంత పవిత్రమైన అనుబంధం ఉన్న నేపథ్యంలో యోగి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

గురువారం మధ్యాహ్నం మథురకు చేరుకోనున్న సీఎం యోగి, 'ఉత్తరప్రదేశ్ బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్' సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అనంతరం గీతా శోధ సంస్థాన్ వద్ద సుమారు రూ. 42 కోట్ల వ్యయంతో నిర్మించిన 'శ్రీ హరిదాస్ ఆడిటోరియం'తో సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. కాగా, ఈ ఆడిటోరియం ప్రాజెక్టును మథుర ఎంపీ హేమా మాలిని ఇదివరకే ప్రారంభించారు.

గీతా శోధ సంస్థాన్ ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం, బృందావన్‌లోని ప్రసిద్ధ శ్రీ బంకే బిహారీ ఆలయాన్ని సందర్శించి సీఎం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం శ్రీ కృష్ణ జన్మస్థాన్ వద్ద 'గో పూజ' నిర్వహించి ఆలయంలో పూజలు చేయనున్నారు. ఆ తర్వాత అక్కడికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథురతో పాటు ఆయన బాల్యం గడిపిన బృందావన్, గోకుల్ ప్రాంతాలు పండుగ శోభతో విలసిల్లుతున్నాయి. అర్ధరాత్రి వేళ ప్రత్యేక పూజలు, భజనలతో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరగనుండటంతో దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.