BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

జాతీయ భద్రతకు ఇంధన స్వయం సమృద్ధి అత్యంత కీలకం

Select Suryaa Now
జాతీయ భద్రతకు ఇంధన స్వయం సమృద్ధి అత్యంత కీలకం

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గుల నేపథ్యంలో భారతదేశానికి ఇంధన భద్రత అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, ఆర్థిక బలం నుండి ఇంధన రంగం విడదీయరానిదని ఆయన స్పష్టం చేశారు.

న్యూఢిల్లీలో 'పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ' నిర్వహించిన "6వ అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2026 – భారతదేశ ఇంధన & ఆహార భద్రతా మిషన్" కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం, డేటా సెంటర్లు వేగంగా పెరుగుతున్నందున, ఆర్థిక వ్యవస్థ గరిష్ఠ ప్రయోజనాలు పొందడానికి చౌకైన, స్వచ్ఛమైన ఇంధనం అత్యవసరమని పేర్కొన్నారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అణు రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడం ద్వారా వనరులు పెరుగుతాయన్నారు.

2033 నాటికి ఐదు 'స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల'ను అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ రైలుతో సహా క్లీన్ ఎనర్జీ రం గానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం ప్రతీ పనిని స్వయంగా చేయలేదని, ప్రైవేట్ భాగస్వామ్యం పెరగాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ R&D పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రూ. 1 లక్ష కోట్ల 'పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ' (RDI) నిధిని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.

ఒకప్పుడు కేవలం 350గా ఉన్న భారత స్టార్టప్‌ల సంఖ్య నేడు 2.4 లక్షలకు చేరి, భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఆవిర్భవించిందని కొనియాడారు.
వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, రవాణా, నీటిపారుదల రంగాలు పెరిగిన ఇంధన అవసరాలను తట్టుకోవడానికి జీవ ఇంధనాలు, ఇథనాల్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

పరిశోధనలు, ఆవిష్కరణలలో 'అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్' ద్వారా ప్రభుత్వేతర భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి పరిశ్రమలు వంతెనలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.