BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలంటూ.. 1,000 రోజుల్లో ప్రజలను నట్టేట ముంచారు: మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి..

Select Suryaa Now
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలంటూ.. 1,000 రోజుల్లో ప్రజలను నట్టేట ముంచారు: మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి..

కుల్కచర్ల: 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, 1,000 రోజులు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కుల్కచర్ల మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి.. 1,000 రోజులు అవుతున్నా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన 420 మోసాలపై బీఆర్‌ఎస్‌ సమరశంఖం పూరిస్తోందని తెలిపారు.
అబద్ధాలు, వంచనలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, పేదల సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.