BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్.. అందరూ కట్టుబడి ఉండాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Select Suryaa Now
అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్.. అందరూ కట్టుబడి ఉండాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

యాదాద్రి జిల్లా: కొండా సురేఖ వ్యవహారంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ పార్టీ పెద్దలను కలిసి తన వాదనను వినిపించారని తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధిష్ఠానం వద్ద పూర్తి సమాచారం ఉందని చెప్పారు.

అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని, పార్టీ నేతలంతా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనేది పూర్తిగా అధిష్ఠానం ఇష్టమని పేర్కొన్నారు.

రాహుల్‌ గాంధీపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. క్యాబినెట్‌ విస్తరణ ఎప్పుడు జరగాలనే అంశంపై కూడా అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

తాను ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నానని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌పై పోరాడిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు న్యాయం జరగాలని ఆయన అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.