BREAKING
డీఆర్డీవోలో రీసెర్చ్ ఉద్యోగాలు తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026: విశేష్ శర్మ సంచలన విజయం ఐటీఆర్ దాఖలుకు అక్టోబర్ 31 వరకు గడువు: వీరికి మాత్రమే వర్తింపు! సన్న వడ్లకు రూ.500 బోనస్: అక్టోబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు డీజేలపై పోలీసుల నిఘా: గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక నజర్ ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి

సమాచార శాఖ అదనపు డైరెక్టర్‌ డీఎస్‌ ‌జగన్‌‌కు ఫెడరేషన్‌ సన్మానం

Select Suryaa Now
సమాచార శాఖ అదనపు డైరెక్టర్‌  డీఎస్‌ ‌జగన్‌‌కు ఫెడరేషన్‌ సన్మానం

సమాచార శాఖ అదనపు
డైరెక్టర్‌  డీఎస్‌ ‌జగన్‌‌కు ఫెడరేషన్‌ సన్మానం

హైదరాబాద్, : సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన డీఎస్‌ ‌జగన్‌‌కు తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(‌టీడబ్ల్యూజేఎఫ్‌) ‌రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలియజేసింది. బుధవారం హైదరాబాద్‌‌లోని సమాచార్‌ ‌భవన్‌‌లో ఫెడరేషన్‌ ‌రాష్ట ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య నాయకత్వంలో ఉపాధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్‌, తాటికొండ కృష్ణ, ‌బి రాజశేఖర్‌, కార్యదర్శి గండ్ర నవీన్‌ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. దీర్ఘకాలికంగా పాత్రికేయుల అభివృద్ధి, సంక్షేమం కోసం జగన్‌ ‌పాటుపడ్డారని చెప్పారు. అక్రిడిటేషన్ల జారీలో మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. పదోన్నతి నేపథ్యంలో మరింత బాధ్యత పెరిగిందనీ, జర్నలిస్టులు, సమాచార శాఖ మధ్య సమన్వయాన్ని పెంచాలని సూచించారు. జిల్లాల్లో అక్రిడిటేషన్ల జారీ విషయంలో డీపీఆర్‌‌వోలు జాప్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా జగన్‌‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. అలాగే జగన్‌‌కు ‘రాజ్యాంగం మనకేమిచ్చింది’ అనే పుస్తకాన్ని ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య బహుకరించారు.