BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

ఘనంగా "జయహో రామానుజ" సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్.. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్!

Select Suryaa Now
ఘనంగా "జయహో రామానుజ" సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్.. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్!

భారతీయ సనాతన ధర్మంలో సమత్వ భావనను, మానవతా విలువలను ప్రపంచానికి చాటిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం "జయహో రామానుజ". లయన్ డా. సాయి వెంకట్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమెరికా నటి జో శర్మ ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మరియు సినీ ప్రముఖులు మాట్లాడిన ముఖ్యాంశాలు:

ప్రవళ్లిక (నిర్మాత, నటి): ఈ చిత్రంలో నిర్మాణ బాధ్యతలతో పాటు కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి వంటి ప్రత్యేక పాత్రలు పోషించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. సమ సమాజ స్థాపన కోసం రామానుజాచార్యులు చేసిన పోరాటాన్ని నేటి తరానికి అందించాలనే సదుద్దేశంతో ఈ సినిమాను రూపొందించాం. అరుదైన ఈ చారిత్రక చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాను.

డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ (టీఎఫ్‌పీసీ ఛైర్మన్): కమర్షియల్ సినిమాల ద్వారా సులభంగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ, మనుషులంతా సమానమే అనే గొప్ప సందేశాన్నిచ్చిన రామానుజాచార్యుల జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకురావాలని సాయి వెంకట్ సంకల్పించడం అభినందనీయం. చినజీయర్ స్వామి ఆశీస్సులతో ఈ చిత్రం ఘన విజయం సాధించాలి.

లయన్ సాయి వెంకట్ (నటుడు, దర్శకుడు): కులమతాల భేదాలు లేకుండా అందరూ సమానమే అని చాటిన ఆధ్యాత్మిక విప్లవకారుడు రామానుజాచార్యులు. ఈ సినిమా ప్రయాణంలో నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అత్యున్నత పోస్ట్ ప్రొడక్షన్ విలువలతో, ఒకే చిత్రంలో 11 విభిన్న పాత్రల్లో నటిస్తూ ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నాం. అక్టోబర్ 25న విడుదలవుతున్న ఈ చారిత్రక చిత్రాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించి విజయవంతం చేయాలని కోరుతున్నాను.

సముద్ర (దర్శకుడు): పదవ శతాబ్దంలోనే సమానత్వ భావనను బోధించిన రామానుజాచార్యుల కథతో సినిమా తీసి సాయి వెంకట్ తన జన్మను ధన్యం చేసుకున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలవాలి.

రామసత్యనారాయణ (నిర్మాత): వెండితెరపై రాముడు అనగానే ఎన్టీఆర్ గుర్తుకొచ్చినట్లుగా, రామానుజాచార్యులు అనగానే సాయి వెంకట్ గుర్తుకువస్తారు. ఇది కేవలం సినిమా కాదు, ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన దృశ్యకావ్యం.