BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ నిరంతర పోరాటం

Select Suryaa Now
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ నిరంతర పోరాటం

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ నిరంతర పోరాటం

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, యువతకు తీవ్ర అన్యాయం..

హామీల అమలులో ఘోర వైఫల్యం..

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి..

ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థుల సమస్యల పరిష్కారం..

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు ; కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా  మోసం చేస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. విద్యార్థి, యువతకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు బిఆర్ఎస్ పార్టీ పక్షాన నిరంతర పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ 420 మోసాల పైన బిఆర్ఎస్ పార్టీ పోరుబాటలో భాగంగా గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా విద్యార్థులతో కలిసి భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటి అమలులో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రధానంగా విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు, కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీ, అర్హులైన నిరుద్యోగ యువతకు ప్రతినెల రూ. 4,000 నిరుద్యోగ భృతి, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం.. అంశాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.  జీవో నంబర్ 97 పేరుతో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థు ఆశలను అడియాశలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకుండా, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, విద్యార్థి, యువజన నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.