BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

Select Suryaa Now
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో అలకనంద, మందాకిని నదులు
రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరుస వర్షాలతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉండటంతో పాటు జలాశయాలు, నదుల్లో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది.

రుద్రప్రయాగ్‌లో ప్రవహించే కీలకమైన అలకనంద, మందాకిని నదుల నీటిమట్టాలు తీవ్రంగా పెరిగి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక యంత్రాంగం, విపత్తు ప్రతిస్పందన దళాలు (SDRF) నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

వర్షాల ధాటికి పలు చోట్ల రాకపోకలకు విఘాతం కలగడంతో, ప్రజలు అత్యవసరం ఐతే తప్ప బయటకు రావద్దని, నదుల వైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.