BREAKING
శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ సీఈఓగా జితేంద్ర మిశ్రా నియామకంపై ఎన్.రామచందర్ రావు హర్షం భారత్-బెల్జియం రక్షణ మంత్రుల ద్వైపాక్షిక చర్చలు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు గాయపడిన ఎస్ఎఫ్ఐ నేతను పరామర్శించిన పినరయి విజయన్ చెన్నైలో 'ఒలింపిక్ సిటీ', 'మోటార్ స్పోర్ట్స్ సిటీ' HYDRAAకు హైకోర్టులో ఊరట.. కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తొలగింపుపై సింగిల్ జడ్జి ఆదేశాలకు తాత్కాలిక బ్రేక్ వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ స్థిరనివాసులు, సైన్యం దాడి గంభీర్‌కు నచ్చిన ఆటగాళ్లకు మళ్లీ ఛాన్స్.. టీమ్ ఎంపికపై బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు గుజరాతీ సంగీత దిగ్గజం గౌరంగ్ వ్యాస్ కన్నుమూత: ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం గ్లోబల్ మార్కెట్లలో ఆటో విడిభాగాల పరిశ్రమ విస్తరించాలి సానుకూల ప్రపంచ సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన భారత మార్కెట్లు ప్రజాస్వామ్యానికి 'బూత్ స్థాయి అధికారులు' కీలక స్తంభాలు ఇంధన భద్రత, కార్బన్ మార్కెట్లపై భారత్-జర్మనీ ద్వైపాక్షిక చర్చలు మయన్మార్‌లో శాంతి, స్థిరత్వానికి భారత్ కట్టుబడి ఉంది పోలవరం క్రెడిట్‌పై చంద్రబాబుపై జగన్‌ ఫైర్‌.. ప్రాజెక్టు ఎత్తుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్

గంభీర్‌కు నచ్చిన ఆటగాళ్లకు మళ్లీ ఛాన్స్.. టీమ్ ఎంపికపై బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Select Suryaa Now
గంభీర్‌కు నచ్చిన ఆటగాళ్లకు మళ్లీ ఛాన్స్.. టీమ్ ఎంపికపై బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

**న్యూస్ డెస్క్**: గంభీర్‌కు నచ్చిన ఆటగాళ్లకు మళ్లీ ఛాన్స్.. టీమ్ ఎంపికపై బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన నేపథ్యంలో జట్టు ఎంపికపై చర్చ మొదలైంది. కొందరు ఆటగాళ్లు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకముందే జట్టులో చోటు దక్కించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిల ఎంపికపై సోషల్ మీడియాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. భారత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఇష్టమైన ఆటగాళ్లకు మరోసారి అవకాశం లభించిందన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు.వాషింగ్టన్ సుందర్‌కు జట్టు మేనేజ్‌మెంట్ నుంచి మంచి మద్దతు లభిస్తోందని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. వచ్చిన అవకాశాన్ని సుందర్ పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి విషయంలో తన అభిప్రాయం భిన్నంగా ఉందని స్పష్టం చేశాడు.

నితీష్‌ను తాను పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా చూడటం లేదని, ప్రధానంగా అతడిని బ్యాటర్‌గానే పరిగణిస్తానని బద్రీనాథ్ చెప్పాడు. బౌలింగ్ విభాగంలో అతడిని ఆధారపడదగిన ఆటగాడిగా భావించడం లేదని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. గౌతమ్ గంభీర్ మద్దతు కారణంగానే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు లభిస్తున్నాయనే చర్చ కూడా క్రికెట్ వర్గాల్లో జరుగుతోంది. అయితే జట్టు ఎంపికలో ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్, జట్టు అవసరాలను పరిగణనలోకి తీసుకున్నామని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది.

బుమ్రా రీఎంట్రీపైనా స్పందించిన బద్రీనాథ్. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి టీ20 జట్టులోకి రావడంపైనా బద్రీనాథ్ స్పందించాడు. బుమ్రా రీఎంట్రీ టీమిండియాకు శుభపరిణామమని పేర్కొన్నాడు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడేందుకు బుమ్రా స్వయంగా మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి ఉండవచ్చని, అందుకే అతడిని జట్టులోకి ఎంపిక చేసి ఉండొచ్చని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో బుమ్రా ప్రదర్శనతో పాటు, విమర్శలు ఎదుర్కొంటున్న ఆటగాళ్లు తమ అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.