BREAKING
సిద్దిపేట సమీపంలోని దుద్దేడ యోగాలింగ క్షేత్రం: అద్భుత విశేషాలు మరియు రహస్య సొరంగ మార్గాలు హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!! కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

వెలిగొండపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు

Select Suryaa Now
వెలిగొండపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు

వెలిగొండపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు

- వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి
 - వైసీపీ నేతలకు శ్యామల కాశిరెడ్డి హెచ్చరిక
సూర్య ప్రతినిధి, ఒంగోలు : 
వెలిగొండ ప్రాజెక్టుపై వైసీపీనాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇకపై సహించేది లేదని ప్రకాశం జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి హెచ్చరించారు. వెలిగొండ ప్రాజెక్టును తామే పూర్తి చేశామని వైసీపీ నేతలు చెప్పడం వాస్తవాలను వక్రీకరించడమేనన్నారు. 1996లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో పనులను వేగవంతం చేసి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని పేర్కొన్నారు. గత రెండేళ్లలో ప్రాజెక్టు కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వెలిగొండ జలాలు అందనున్న ప్రాంతాల రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
జగన్‌ మెప్పు కోసం వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని శ్యామల కాశిరెడ్డి విమర్శించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. 2019లో మాగుంటకు వైసీపీ టికెట్‌ ఇచ్చినప్పుడు ఆయన లిక్కర్‌ వ్యాపారం గురించి ఆ పార్టీ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. మాగుంట కుటుంబం మూడు దశాబ్దాలుగా ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో ప్రజలకు సేవలందిస్తోందన్నారు.వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కూడా శ్యామల కాశిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మద్యం వ్యవహారంలో చిక్కుకుని జైలుకు వెళ్లిన చెవిరెడ్డి, ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కలిగిన వ్యక్తి అంటూ ఆరోపించారు. చంద్రగిరిలో ప్రజలు తిరస్కరించడంతో ఒంగోలు వచ్చిన చెవిరెడ్డిని ఇక్కడి ప్రజలు కూడా తిరస్కరించారని దీంతో తిరిగి చంద్రగిరి వెళ్లి దందాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని శ్యామల కాశిరెడ్డి సూచించారు.