BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

మాగుంటపై నోరుపారేసుకుంటే సహించేది లేదు

Select Suryaa Now
మాగుంటపై నోరుపారేసుకుంటే సహించేది లేదు

మాగుంటపై నోరుపారేసుకుంటే సహించేది లేదు

- వైసీపీ నేతల వ్యాఖ్యలపై శ్యామల కాశిరెడ్డి తీవ్ర ఆగ్రహం

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై వైసీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ప్రకాశం జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజా సేవలో మూడు దశాబ్దాలుగా మాగుంట కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందని అలాంటి కుటుంబంపై నోటికొచ్చినట్లు మాట్లాడటం వైసీపీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.

మాగుంట లిక్కర్‌ వ్యాపారం చేస్తున్నారని ఇప్పుడు విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు 2019లో మాగుంటకు తమ పార్టీ తరఫున టికెట్‌ ఇచ్చినప్పుడు ఈ విషయం తెలియదా అని శ్యామల కాశిరెడ్డి ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒకప్పుడు మాగుంటను అక్కున చేర్చుకుని ఇప్పుడు విమర్శలు చేయడం వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని శ్యామల కాశిరెడ్డి హెచ్చరించారు. మాగుంటపై నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో మాగుంట కుటుంబం చేసిన సేవలను ప్రజలు మరచిపోలేదని స్పష్టం చేశారు.వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మాగుంటను విమర్శించే నైతిక హక్కు లేదని శ్యామల కాశిరెడ్డి అన్నారు. మాగుంటపై విమర్శలు చేసే ముందు చెవిరెడ్డి తన రాజకీయ ప్రస్థానం గత వ్యవహారాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే తగిన స్థాయిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.