BREAKING
ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ నేపాల్ చిలిమే సొరంగం క్లియరెన్స్‌లో ముమ్మరంగా భారత బృందాల యత్నాలు పోలీస్ సంస్మరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ఆకట్టుకుంటున్న ‘ఏరై పారే హృదయం’ గీతం.. విడుదల చేసిన డా. సీహెచ్. ప్రీతిరెడ్డి!

Select Suryaa Now
ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ఆకట్టుకుంటున్న ‘ఏరై పారే హృదయం’ గీతం.. విడుదల చేసిన డా. సీహెచ్. ప్రీతిరెడ్డి!

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న అందమైన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ కుమార్ కథ, కథనం అందిస్తూ దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఇది వరకే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకవర్గాల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయగా, తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా చిత్రంలోని ‘ఏరై పారే హృదయం’ అంటూ సాగే మధురమైన గీతాన్ని మల్లారెడ్డి విశ్వవిద్యానిలయం వైస్ చైర్మన్ డా. సీహెచ్. ప్రీతిరెడ్డి ఘనంగా విడుదల చేశారు.

సమీరా భరద్వాజ్ తన మంత్రముగ్ధులను చేసే స్వరాంతో ఈ పాటను ఆలపించగా, రాంబాబు గోసాల అందించిన ఆకట్టుకునే సాహిత్యం, సునాద్ గౌతమ్ కూర్చిన అద్భుతమైన బాణీలు ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన విజువల్స్, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ఈ గీతానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పాట విడుదల అనంతరం ప్రముఖులు పంచుకున్న అభిప్రాయాలు ఇక్కడ ఉన్నాయి:

డా. సీహెచ్. ప్రీతిరెడ్డి: ‘ప్రేమనే ఊరిలో’ టీజర్ ఇప్పటికే నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ‘ఏరై పారే హృదయం’ పాటను విడుదల చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణం, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. ఈ సినిమా ఘన విజయం సాధించాలి.

చందు శ్రీనివాస్ (నిర్మాత): మా చిత్రంలోని పాటను లాంచ్ చేసి మాకు అండగా నిలిచిన ప్రీతిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆమె చేతుల మీదుగా సాంగ్ రిలీజ్ కావడం మా చిత్ర యూనిట్‌కు పాజిటివ్ వైబ్స్‌ను తెచ్చింది. సినిమా సక్సెస్ మీట్‌కు కూడా ఆమె హాజరవుతారని ఆశిస్తున్నాం. ఈ చిత్రంలోని ప్రతీ పాట శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది.

సురేష్ కొండేటి (నిర్మాత): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్బంగా ఈ అద్భుతమైన గీతాన్ని విడుదల చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ప్రీతిరెడ్డి చేతుల మీదుగా వచ్చిన ఈ ‘ఏరై పారే హృదయం’ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.