BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

విజయ్ మంచి సీఎం కావాలి.. కాంగ్రెస్ అండగా ఉంటుంది

Select Suryaa Now
విజయ్ మంచి సీఎం కావాలి.. కాంగ్రెస్ అండగా ఉంటుంది

తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ మాణికం ఠాగూర్
మదురై: తమిళవెట్రి కజగం (TVK) పార్టీ అధినేత, నటుడు విజయ్ రాజకీయ అడుగులపై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ మాణికం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, విజయ్ తమిళనాడుకు అద్భుతమైన ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మాణికం ఠాగూర్ మాట్లాడుతూ విజయ్ ప్రధాని కావాలంటూ TVK వర్గాల్లో వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, అవి సదరు వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని ఆ పార్టీ కోశాధికారి వెంకటరామన్ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ దృష్టిలో ఆ వివాదం అక్కడితో ముగిసిపోయిందన్నారు. విజయ్‌కు తమిళనాడు ప్రజల నుంచి విశేష ఆదరణ, భారీ మద్దతు లభిస్తోందని కొనియాడారు.

కమీషన్లు లేని, అత్యుత్తమ అవినీతి రహిత పాలనను అందిస్తూ విజయ్ ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా ఎదగడానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. విజయ్ మంచి ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనకు తమ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.