BREAKING
లైసెన్స్ మద్యం షాప్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు..... పడారుపల్లి పీహెచ్‌సీలో పోషణ కార్యక్రమం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నెల్లూరు సీడీపీఓ టి. అరుణ దేశంలో చారిత్రాత్మక అక్షరాస్యత ప్రగతి పెదభోగిల లో " ఇంటింటికి మన్యం పోలీస్ " పలు అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం,ఐ సి డి ఎస్ రంగనాయకులపేట సెక్టర్ సూపర్వైజర్ కే.విజయలక్ష్మి ఎన్నికల సమయంలో సమస్యాత్మక వార్డుల్లో ప్రత్యేక నిఘా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల విద్యుత్ కేటగిరీ మార్పుపై కృతజ్ఞతలు ప్రపంచ హృదయ దినోత్సవం 2026 పద్మశాలి భవనానికి 2 కోట్ల నిధులు విడుదల బాచేపల్లి తాండ విద్యా కమిటీ చైర్మన్గా కృష్ణ నాయక్ ఎస్జీఎఫ్‌ అండర్‌-19కు అనంతపురం యువ క్రీడాకారుల ఎంపిక గ్రామీణ ఉపాధి రంగానికి సరికొత్త రూపం రైతు సమస్యలపై పీఏసీఎస్‌ గళం అంగన్వాడీ సేవలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగించుకోవాలి హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌యే విశ్వసనీయ భాగస్వామి

జైనూర్ సీహెచ్‌సీలో కలెక్టర్ కె. హరిత ఆకస్మిక తనిఖీ

Select Suryaa Now
జైనూర్ సీహెచ్‌సీలో కలెక్టర్ కె. హరిత ఆకస్మిక తనిఖీ
 
మందుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ కె. హరిత
సూర్య జైనూర్,  జైనూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ (సీహెచ్‌సీ)ను జిల్లా కలెక్టర్ కె. హరిత మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ఆసుపత్రికి చేరుకున్న కలెక్టర్ వైద్య సేవల నిర్వహణ, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సంబంధిత వైద్యులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న సేవలు, వైద్య సిబ్బంది విధుల నిర్వహణ, సమయపాలన తదితర అంశాలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం ఆసుపత్రిలోని మందుల స్టాక్‌ను కలెక్టర్ పరిశీలించారు. మందులను సక్రమంగా వినియోగించకుండా స్టాక్‌లోనే ఉంచి గడువు ముగిసేలా చేసి వృథా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మందుల వినియోగం, నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ, అవసరానికి అనుగుణంగా మందులు అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. గడువు ముగిసిన మందులు నిల్వల్లో ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.వైద్య సిబ్బంది విధులకు నిర్ణీత సమయానికి హాజరై బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.అలాగే ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో ఆసుపత్రి సిబ్బందిలో అప్రమత్తత నెలకొంది. ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత, మందుల లభ్యత, పారిశుధ్యం, సిబ్బంది సమయపాలనపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.