BREAKING
9/11 తరహా పెను ప్రమాదాన్ని తప్పించిన భారతీయ పైలట్ వార్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించాం: ఎంపీ మల్లు రవి లబ్ధిదారులను పలకరించి పింఛన్లను పంపిణీ చేసిన కర్రోతు అర్హులందరికీ పారదర్శకంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు…:జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. వెంకటేశ్వర పల్లి లో ప్రత్యేక వైద్య శిబిరం హాలీవుడ్ థ్రిల్లర్ వెరిటీకి ఏ సర్టిఫికేట్.. సీబీఎఫ్‌సీ కట్స్ తో భారత్‌లో విడుదలకు సిద్ధం రాష్ట్రస్థాయి పోటీలకు బాడంగి విద్యార్థులు ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ నిలిపివేతపై హైకోర్టులో పిటిషన్.. విచారణ మంగళవారానికి వాయిదా అమ్వి ఫుడ్స్ డీహైడ్రేషన్ ప్లాంట్‌ను సందర్శించిన కలెక్టర్ మహేష్ కుమార్.. పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. ! స్వాతంత్ర సమరయోధుడు శంకరయ్యను కలిసిన సిపిఐ నాయకులు! డోరతి తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది.. టైటిల్ అర్థంపై రానా వివరణ, రిపోర్టర్‌కు సింగర్ చిన్మయి మద్దతు దుర్గమ్మకు కలెక్టర్ చేతుల మీదుగా పింఛన్ మంజూరు.! ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి -ఇంచార్జ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రఫిక్

Select Suryaa Now
ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి -ఇంచార్జ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రఫిక్

ఎయిడ్స్ చికిత్స కన్నా నివారణ మేలు అందుకని హెచ్ఐవి నివారణ పై కళాజాత బృందాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు ఇంచార్జ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎండి .రఫిక్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో హెచ్ఐవి/ ఎయిడ్స్ పై  కళాజాత ప్రదర్శనను ఇంచార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్   జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ  స్వరమాధురి కళాజాత  బృందం  ప్రదర్శనలు హెచ్ఐవి ఏ విధంగా వ్యాపిస్తుంది, హెచ్ఐవి  వల్ల కలిగే నష్టాలు,నివారణ మార్గాలు, ఐ సి టి సి వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాల సమాచారం, ఏ ఆర్ టి (ఆంటీ రిట్రో వైరల్ తెరపి) చికిత్స, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకి హైరిస్క్ గ్రూపుల గురించి విస్తృత ప్రచారం కల్పిస్తారనీ తెలిపారు.  అక్టోబర్ 2న కల్వకుర్తి, 3న తెలకపల్లి ,అచ్చంపేట పట్టణంలో, 4 న పెంట్లవెల్లి మరియు కొల్లాపూర్ బస్టాండ్ దగ్గర కళాజాత ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపారు.  కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఎ. యాదయ్య, ఉప జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాలచారి, దిశా కార్యక్రమ మేనేజర్ రమేష్, సాయి కుమార్ ,రవీందర్ రెడ్డి, రాష్ట్ర పరిశీలకులు నరసింహ,హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ పై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులు, డిపిఎంవో సుకుమార్ రెడ్డి, సిహెచ్ఓ హెమ్ లాల్, కోట్ర బాలాజీ, ఎస్ టి ఎస్ శ్రీను, ఆరిఫ్, ప్రయాణికులు పాల్గొన్నారు.
పి .వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్