BREAKING
దుబాయ్ కాలేదు.. ‘దెయ్యాల ఓడరేవు’గా మారిన పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్! అమెరికా ఉత్పత్తులను బహిష్కరిస్తున్న కెనడియన్లు రైతుల భవిష్యత్తుకు ఆర్థిక ధీమా ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి రూ. 25,000కు పెంపు యుద్ధ నేరాల కేసులో కొసోవో మాజీ అధ్యక్షుడు థాసికి 25 ఏళ్ల జైలు శిక్ష యెమెన్‌పై సౌదీ బాంబుల వర్షం వాయు కాలుష్యంతో ఆత్మహత్యా ఆలోచనల ప్రమాదం ఈయూ తొలి ‘అసోసియేట్ సభ్యదేశం’గా కెనడా జిల్లాలో 4500 గణపతి విగ్రహాలు నిమజ్జనం ఎస్ పి ఆరోగ్యం, విద్య, వాతావరణ రంగాల్లో ఏఐ విప్లవం భారత అభివృద్ధిలో మహారాష్ట్ర పాత్ర ప్రశంసనీయం ‘ఫ్రాంకెన్‌స్టైన్’ను నిర్మించకండి జీ20 సదస్సులో భారత ఇంధన ప్రగతిని వివరించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ 'ఆశీర్వాద్ కా దీపం' వెలిగించాలి నెట్ జీరో పోర్టల్, నాప్సీసీ డాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్

హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి…

Select Suryaa Now
హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి…

- వివాదాస్పద వ్యాఖ్యలపై అంబేద్కర్‌ సంఘాల నిరసన…

- హమారా ప్రసాద్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు…

సూర్య, నాగిరెడ్డి పేట్:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ పై ప్రభుత్వం కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం హమారా ప్రసాద్ రాసిన వివాదాస్పద పుస్తకాన్ని వెంటనే నిలిపివేసి, అతనిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు మిద్దె బాబురావు అధ్యక్షతన స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో గిర్ధవర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు మిద్దె బాబురావు మాట్లాడుతూ.. దేశానికి అంబేద్కర్‌ చేసిన సేవలు, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం చిరస్మరణీయమన్నారు. అటువంటి మహనీయుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం, ఆయనను కల్పిత నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. పుస్తక ప్రచురణ, వ్యాప్తిని నిలిపివేసి బాధ్యునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు ప్రభాకర్, శ్రీనివాస్, దేవయ్య, రత్నం, కిష్టాపర్, వెంకట్, మధు, ఉషయ్య, సాయిలు, బాబురావు, బాబు, జయరాం, తదితరులు పాల్గొన్నారు.