BREAKING
ఓజోన్ పొర పరిరక్షణ, వాతావరణ చర్యలకు భారత్ కట్టుబాటు లార్జ్-క్యాప్స్ మెరుపు రూ. 3 లక్షల వరకు ఎగుమతులకు 'RCMC' నుంచి మినహాయింపు దుబాయ్ కాలేదు.. ‘దెయ్యాల ఓడరేవు’గా మారిన పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్! అమెరికా ఉత్పత్తులను బహిష్కరిస్తున్న కెనడియన్లు రైతుల భవిష్యత్తుకు ఆర్థిక ధీమా ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి రూ. 25,000కు పెంపు యుద్ధ నేరాల కేసులో కొసోవో మాజీ అధ్యక్షుడు థాసికి 25 ఏళ్ల జైలు శిక్ష యెమెన్‌పై సౌదీ బాంబుల వర్షం వాయు కాలుష్యంతో ఆత్మహత్యా ఆలోచనల ప్రమాదం ఈయూ తొలి ‘అసోసియేట్ సభ్యదేశం’గా కెనడా జిల్లాలో 4500 గణపతి విగ్రహాలు నిమజ్జనం ఎస్ పి ఆరోగ్యం, విద్య, వాతావరణ రంగాల్లో ఏఐ విప్లవం భారత అభివృద్ధిలో మహారాష్ట్ర పాత్ర ప్రశంసనీయం ‘ఫ్రాంకెన్‌స్టైన్’ను నిర్మించకండి

యుద్ధ నేరాల కేసులో కొసోవో మాజీ అధ్యక్షుడు థాసికి 25 ఏళ్ల జైలు శిక్ష

Select Suryaa Now
యుద్ధ నేరాల కేసులో కొసోవో మాజీ అధ్యక్షుడు థాసికి 25 ఏళ్ల జైలు శిక్ష

ది హేగ్:హత్యలు, హింస, అక్రమ నిర్బంధం వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో కొసోవో మాజీ అధ్యక్షుడు హషిమ్ థాసికి (58) ప్రత్యేక ట్రిబ్యునల్ 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 1990వ దశకంలో సెర్బియా నుంచి కొసోవో విడిపోయే సమయంలో కొసోవో లిబరేషన్ ఆర్మీ (KLA) అగ్ర కమాండర్‌గా వ్యవహరించిన థాసి, 96 మంది రాజకీయ ప్రత్యర్థులను హత్య చేయించడమే కాకుండా వందలాది మందిని హింసించి, అక్రమంగా నిర్బంధించడంలో చురుగ్గా పాల్గొన్నారని కోర్టు స్పష్టం చేసింది.

హేగ్‌లోని కొసోవో స్పెషలిస్ట్ ఛాంబర్స్ ఈ తీర్పును వెలువరించగా, థాసి తనపై ఉన్న ఆరోపణలన్నింటినీ ఖండించారు. 1998-99 నాటి ఈ ఘర్షణలు ఇప్పటికీ అల్బేనియన్లు, సెర్బ్‌ల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఈ తీర్పుపై కొసోవోలోని అల్బేనియన్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశ రాజధాని ప్రిస్టినాలో వేలాది మంది ప్రజలు భారీ స్క్రీన్‌లపై తీర్పును వీక్షిస్తూ, ట్రిబ్యునల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.