BREAKING
యుద్ధ నేరాల కేసులో కొసోవో మాజీ అధ్యక్షుడు థాసికి 25 ఏళ్ల జైలు శిక్ష యెమెన్‌పై సౌదీ బాంబుల వర్షం వాయు కాలుష్యంతో ఆత్మహత్యా ఆలోచనల ప్రమాదం ఈయూ తొలి ‘అసోసియేట్ సభ్యదేశం’గా కెనడా జిల్లాలో 4500 గణపతి విగ్రహాలు నిమజ్జనం ఎస్ పి ఆరోగ్యం, విద్య, వాతావరణ రంగాల్లో ఏఐ విప్లవం భారత అభివృద్ధిలో మహారాష్ట్ర పాత్ర ప్రశంసనీయం ‘ఫ్రాంకెన్‌స్టైన్’ను నిర్మించకండి జీ20 సదస్సులో భారత ఇంధన ప్రగతిని వివరించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ 'ఆశీర్వాద్ కా దీపం' వెలిగించాలి నెట్ జీరో పోర్టల్, నాప్సీసీ డాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పాకిస్థాన్ నౌకాదళం నిర్లక్ష్యంపై భారత్ తీవ్ర ఆగ్రహం సాంప్రదాయ కళాకారుల అభివృద్ధికి పీఎం విశ్వకర్మ పథకం ఉత్సాహభరితమైన భవిష్యత్తుకు అధికార సమతుల్యతే కీలకం ఘనంగా ‘ఆస్మాన్’ టీజర్ లాంచ్.. హాజరైన మంచు మనోజ్, శివాత్మిక

‘ఫ్రాంకెన్‌స్టైన్’ను నిర్మించకండి

Select Suryaa Now
‘ఫ్రాంకెన్‌స్టైన్’ను నిర్మించకండి

ఏఐ ల్యాబ్స్‌కు యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
వాషింగ్టన్: ప్రమాదకరమైన ఏఐ వ్యవస్థలను నిర్మిస్తూ, ఆపై ప్రభుత్వ నియంత్రణలు కోరుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్‌లపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆల్-ఇన్ పాడ్‌కాస్ట్'లో ఆయన మాట్లాడుతూ, ఏఐ కంపెనీలు తాము "ఫ్రాంకెన్‌స్టైన్" లాంటి భయంకరమైన వ్యవస్థలను సృష్టిస్తున్నామని చెబుతూనే, వాటికి తగిన రక్షణ సాధనాలను ఇతరులకు నిరాకరించడం సరికాదన్నారు.

ముందుగా ప్రమాదకరమైన మోడళ్ల నిర్మాణాన్ని ఆపాలని, ఒకవేళ తయారు చేస్తే సైబర్ దాడులు వంటి ముప్పుల నుండి ఎదుర్కొనేందుకు వీలుగా ఇతర కంపెనీలకు రక్షణ సాధనాలను (Defense tools) అందించాలని హితవు పలికారు. ప్రభుత్వాన్ని నియంత్రణలు కోరే ముందు ఏఐ ల్యాబ్‌లు ఆత్మపరిశీలన చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్, సామ్ ఆల్ట్‌మన్, సత్య నాదెళ్ల వంటి టెక్ దిగ్గజాల మధ్య ఏఐ వేగాన్ని తగ్గించడంపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో జేడీ వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.