BREAKING
ఈయూ తొలి ‘అసోసియేట్ సభ్యదేశం’గా కెనడా జిల్లాలో 4500 గణపతి విగ్రహాలు నిమజ్జనం ఎస్ పి ఆరోగ్యం, విద్య, వాతావరణ రంగాల్లో ఏఐ విప్లవం భారత అభివృద్ధిలో మహారాష్ట్ర పాత్ర ప్రశంసనీయం ‘ఫ్రాంకెన్‌స్టైన్’ను నిర్మించకండి జీ20 సదస్సులో భారత ఇంధన ప్రగతిని వివరించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ 'ఆశీర్వాద్ కా దీపం' వెలిగించాలి నెట్ జీరో పోర్టల్, నాప్సీసీ డాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పాకిస్థాన్ నౌకాదళం నిర్లక్ష్యంపై భారత్ తీవ్ర ఆగ్రహం సాంప్రదాయ కళాకారుల అభివృద్ధికి పీఎం విశ్వకర్మ పథకం ఉత్సాహభరితమైన భవిష్యత్తుకు అధికార సమతుల్యతే కీలకం ఘనంగా ‘ఆస్మాన్’ టీజర్ లాంచ్.. హాజరైన మంచు మనోజ్, శివాత్మిక పీఎఫ్‌ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. 51 లక్షల మందికి అదనపు ప్రయోజనం అక్టోబర్ 2న థియేటర్లలో సందడి చేయనున్న ‘సిగ్మా’.. ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర విశేషాలు వెల్లడించిన చిత్ర యూనిట్ భక్తులకు తాగునీరు సరఫరా

సాంప్రదాయ కళాకారుల అభివృద్ధికి పీఎం విశ్వకర్మ పథకం

Select Suryaa Now
సాంప్రదాయ కళాకారుల అభివృద్ధికి పీఎం విశ్వకర్మ పథకం

మూడేళ్లలో 30 లక్షల మంది నమోదు
న్యూఢిల్లీ: దేశంలోని సాంప్రదాయ కళాకారులు, చేతివృత్తుల వారికి పూర్తిస్థాయి మద్దతునందించే పీఎం విశ్వకర్మ పథకం మూడేళ్లు పూర్తి చేసుకుని 30 లక్షల మంది లబ్ధిదారుల నమోదు లక్ష్యాన్ని సాధించింది. 2023 సెప్టెంబర్ 17న రూ.13,000 కోట్ల కేటాయింపుతో ప్రారంభమైన ఈ పథకం సమ్మాన్, సమర్థ్య, సమృద్ధి అనే మూడు మూలస్తంభాల ఆధారంగా 18 సాంప్రదాయ వృత్తుల వారికి గుర్తింపు, నైపుణ్య శిక్షణ, ఉచిత టూల్‌కిట్లు, పూచీకత్తు లేని రుణాలు, మార్కెటింగ్ సహాయాన్ని అందిస్తోంది.

ఈ పథకం కింద ఇప్పటివరకు 24.37 లక్షల మంది కళాకారులు నైపుణ్య శిక్షణ పొందగా, 18.16 లక్షల మందికి రూ.15,000 విలువైన ఆధునిక టూల్‌కిట్లు అందాయి. రోజుకు రూ.500 స్టైఫండ్‌తో పాటు 5 శాతం రాయితీ వడ్డీకే మొదటి విడతలో రూ.1 లక్ష, రెండో విడతలో రూ.2 లక్షల పూచీకత్తు లేని రుణాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.5,316 కోట్ల విలువైన 6.19 లక్షల రుణాలు మంజూరయ్యాయి.

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రతినెలా గరిష్టంగా 100 లావాదేవీల వరకు ప్రతీ లావాదేవీకి రూపాయి చొప్పున ఇప్పటివరకు రూ.42 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అమెజాన్, గేమ్‌ (GeM), మీషో వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో 30,000 మంది లబ్ధిదారులను అనుసంధానించడమే కాకుండా, 12,000 మందికి ఏఐ సాధనాల వినియోగంలో శిక్షణ ఇచ్చారు. 18 ఏళ్లు నిండి, స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తిదారులు కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.