♏ వృశ్చిక రాశి (Scorpio) Vrischika Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | వృశ్చిక రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani
వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
ప్రారంభంలో శ్రమ ఒత్తిడి అధికం. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ. ప్రశాంతత తక్కువ. నిద్రలేమి. భాగస్వామికి, సంతాన రీత్యా షాపింగ్ లకి ఖర్చులు అధికం. బంధువుల కలయిక. ఆత్మీయులతో కమ్యూనికేషన్ జాగ్రత్తలు అవసరం. వారం మధ్యలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. తండ్రి అభిప్రాయములను గౌరవించాలి. గురువులతో సంప్రదింపులు. ముఖ్యంగా ఆధ్యాత్మిక మందిరాలు, కార్యక్రమాలు, సంబంధ ఖర్చులు. వారాంతం ఆర్థిక విషయాలు సామాన్యం. కుటుంబ అవసరాలకి, సంతాన వర్గానికి ఖర్చులు. మాటల మీద నియంత్రణ అవసరం. ముఖ్యులతో వాదనలకు దూరం మేలు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన మేలు.