♈ మేష రాశి (Aries) Mesha Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మేష రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani
మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)
ప్రారంభంలో సాంఘిక సంబంధాలు గుర్తింపు గౌరవం. భాగస్వామితో, మరియు వ్యాపార వ్యవహారాల్లో, మిత్రులతో కమ్యూనికేషన్ లో జాగ్రత్త అవసరం. కుటుంబ ఆరోగ్య, రుణ, న్యాయ, వ్యవహారాల్లో ఆకస్మిక నిర్ణయాలు. మధ్యలో వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ, ఆలోచనలలో తొందరపాటు లేకుండా, విద్య, స్థిరాస్తులు,డ్రైవింగ్ వంటి విషయాలలో శ్రద్ధ ముఖ్యం. తల్లి ఆరోగ్యపై దృష్టి. అనవసర వాదాలకు దూరంగా ఉండాలి. వారాంతం ఉన్నత విద్య, ఆధ్యాత్మిక దూర ప్రయాణాల ఆలోచనలు, కుటుంబ సభ్యులతో, గురువుతో చర్చలు. పని ఒత్తిడి, నిద్రలేమి. అసంతృప్తి అధిగమించాలి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన మేలు.