♒ కుంభ రాశి (Aquarius) Kumbha Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | కుంభ రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani
కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
ప్రారంభంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తండ్రి ,సంబంధ బంధువుల విషయాలు మీద దృష్టి. దూర ప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు, పెద్దల ఆశీస్సులు. తోబుట్టువులు మిత్రుల సహకారంతో ఆర్థిక విషయాల లో చర్చలు. వేగంగా ఆలోచనలు, వృత్తిలో ఆకస్మిక నిర్ణయాలు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ఆ విషయంలో ఆత్మీయుల సహకారం అవసరం. విందు వినోదాలకు అవకాశం. వారంమధ్యలో వృత్తిలో నూతన అవకాశాల కొరకు ప్రయత్నాలు, ఆర్థిక లాభాలకి శ్రమ అధికం చేస్తారు. విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలలో ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. వారాంతం ఆశించిన విషయాలనుకూలం, ప్రశాంతత లభ్యం. దుర్గాదేవి ఆరాధన మేలు.