♉ వృషభ రాశి (Taurus) Vrishabha Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | వృషభ రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani
వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
ప్రారంభంలో అధిక శ్రమతో అనుకున్న పనుల సాధన. కీలక విషయాలు బంధు, మిత్రులతో చర్చలు. స్త్రీలతో వీలైనంత ఆచితూచి వ్యవహరించాలి. రొటీన్లో మార్పులు. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ. మధ్యలో భాగస్వామి ఆరోగ్యశ్రద్ధ మరియు కమ్యూనికేషన్లో అపార్ధాలు అధిగమించాలి. ప్రశాంతత తక్కువ. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. సాంఘిక సంబంధాలలో, కొత్త పరిచయాలలో జాగ్రత్తలు ముఖ్యం. ఆర్థికాంశాలలో మార్పులు. వారాంతం ముఖ్య విషయాలు వాయిదాలకి అవకాశం. ఆర్థిక లాభాలలో ఆకస్మిక నిర్ణయాలు, సజ్జన సహకారం లభ్యం. పెట్టుబడులలో ఆలోచనలను, నెట్వర్క్ పెంచుకుంటూ తండ్రి, పెద్దల ప్రోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేయడానికి ప్రయత్నం. గౌరీ ఆరాధన మేలు.