BREAKING
యాపిల్ అంచనాలను తలకిందులు చేసిన త్రైమాసిక ఫలితాలు నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఒక్క ఓటుతో టిడిపి ముందంజ తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానలకుపాల్బడవద్దు,, హక్కులసాధనకై పోరాడాలి..... వైట్‌హౌస్ వద్ద ఎయిర్‌ఫోర్స్ వన్ విమాన ప్రదర్శనపై వివాదం సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు, మళ్లీ పెరిగిన క్రూడాయిల్ ధరలు జపాన్‌లో పెట్రోల్ సబ్సిడీల కోత కాపర్ కాన్సంట్రేట్ ధరల విధానంలో మార్పులు రెండేళ్లలో బ్రిటన్‌పై కృత్రిమ మేధ సైబర్ దాడి ముప్పు అమెరికా మధ్యకాలిక ఎన్నికల వేళ తగ్గిన బంగారం ధరలు అమెరికాలో జపాన్, కొరియా, తైవాన్ కంపెనీల పెట్టుబడుల జోరు క్రూడాయిల్ ధరల పతనంతో రూపాయికి ఊరట ఆస్ట్రేలియా సోషల్ మీడియా నిషేధంపై రెడ్డెట్ ఘాటు వ్యాఖ్యలు ఎమ్మిగనూరు పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ముందంజ తమిళనాడులో దంచికొడుతున్న భారీ వర్షాలు, కడలూరులో పాఠశాలలకు సెలవులు దుబాయ్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

పూరీలో పతితపావనుడి మంగళ హారతి దర్శనం

Select Suryaa Now
 పూరీలో పతితపావనుడి మంగళ హారతి దర్శనం

సూర్య బ్యూరో: ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయానికి (శ్రీమందిర్) భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రధాన సింహద్వారం వద్ద కొలువుదీరిన శ్రీ పతితపావనుడి మంగళ హారతిని తిలకించేందుకు వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తుల ‘జై జగన్నాథ్’ నామస్మరణలతో ఆలయ పరిసరాలు, బడాదండ వీధి మార్మోగాయి.

ఆలయంలోకి ప్రవేశించలేని భక్తులకు సైతం అనుగ్రహం ప్రసాదించే కరుణామయుడిగా భావించే పతితపావనుడి మంగళ హారతిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. తెల్లవారుజామునే శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, మంగళ హారతి సేవను భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించి తరించారు.

భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో ఎలాంటి తొక్కిసలాటలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా శ్రీమందిర్ పరిపాలనా విభాగం, పూరీ జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాయి. క్యూలైన్ల క్రమబద్ధీకరణతో పాటు తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.