BREAKING
యాపిల్ అంచనాలను తలకిందులు చేసిన త్రైమాసిక ఫలితాలు నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఒక్క ఓటుతో టిడిపి ముందంజ తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానలకుపాల్బడవద్దు,, హక్కులసాధనకై పోరాడాలి..... వైట్‌హౌస్ వద్ద ఎయిర్‌ఫోర్స్ వన్ విమాన ప్రదర్శనపై వివాదం సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు, మళ్లీ పెరిగిన క్రూడాయిల్ ధరలు జపాన్‌లో పెట్రోల్ సబ్సిడీల కోత కాపర్ కాన్సంట్రేట్ ధరల విధానంలో మార్పులు రెండేళ్లలో బ్రిటన్‌పై కృత్రిమ మేధ సైబర్ దాడి ముప్పు అమెరికా మధ్యకాలిక ఎన్నికల వేళ తగ్గిన బంగారం ధరలు అమెరికాలో జపాన్, కొరియా, తైవాన్ కంపెనీల పెట్టుబడుల జోరు క్రూడాయిల్ ధరల పతనంతో రూపాయికి ఊరట ఆస్ట్రేలియా సోషల్ మీడియా నిషేధంపై రెడ్డెట్ ఘాటు వ్యాఖ్యలు ఎమ్మిగనూరు పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ముందంజ తమిళనాడులో దంచికొడుతున్న భారీ వర్షాలు, కడలూరులో పాఠశాలలకు సెలవులు దుబాయ్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

ముంబై కలప గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

Select Suryaa Now
ముంబై కలప గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

సూర్య బ్యూరో: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మలాడ్ వెస్ట్‌లోని ఆనంద్ రోడ్డులో ఉన్న ప్రముఖ ‘రుయా టింబర్ వేర్‌హౌస్’ (కలప గోడౌన్)లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో పెద్ద ఎత్తున కలప నిల్వలు ఉండటంతో మంటలు క్షణాల్లోనే పరిసర ప్రాంతాలకు వ్యాపించి దట్టమైన పొగలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక దళ సిబ్బంది, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పలు ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదని, షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరియు అగ్నిమాపక అధికారులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, ఆస్తి నష్టం వివరాలపై విచారణ జరుపుతున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా సమీప భవనాల్లోని వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.