BREAKING
గంభీరావుపేట ఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ గాయపడిన కార్యకర్తకు అండగా కేతిరెడ్డి జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల.. ఆకట్టుకుంటున్న పోస్టర్ అమ్మ వారికి ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు అక్రమ కేసులు, బెదిరింపులతో వైకాపాను అడ్డుకోలేరు: బుట్టా రేణుక హిందూపురం టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పై ఉత్కంఠం సెంచరీకి చేరువలో సన్నబియ్యం.... *పేదలకు అందనంత పైకి వెళ్లిన బియ్యం ధర ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవర్ణ మహేష్ అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం ఎన్.హెచ్.ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకంటాo... "రిటర్నింగ్ అధికారి బి ఆశయ్య వెల్లడి" నెట్‌ఫ్లిక్స్‌లో పెను ప్రకంపనలు.. కంటెంట్ చీఫ్ బేలా బజారియా తొలగింపు టీవీ 7 కార్యాలయంపై దాడి అమానుషం మిర్యాలగూడ కోర్టు, మున్సిపాలిటీ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఆస్కార్ బరిలో నిలిచిన మరాఠీ సస్పెన్స్ థ్రిల్లర్ గొంధల్.. నవంబర్ 13న పాన్ ఇండియా స్థాయిలో భారీ విడుదల

Select Suryaa Now
ఆస్కార్ బరిలో నిలిచిన మరాఠీ సస్పెన్స్ థ్రిల్లర్ గొంధల్.. నవంబర్ 13న పాన్ ఇండియా స్థాయిలో భారీ విడుదల

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ రీతిలో మరో ప్రతిష్టాత్మక చిత్రం అంతర్జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ మరాఠీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన గొంధల్ సినిమా ప్రపంచ అత్యున్నత చలనచిత్రోత్సవ పురస్కారమైన ఆస్కార్ రేసులోకి అధికారికంగా ప్రవేశించింది. రాబోయే 99వ అకాడమీ అవార్డ్స్ పోటీల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఈ చిత్రం ఎంపిక కావడం విశేషం. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ చారిత్రాత్మక ఎంపికను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో మరియు ప్రేక్ష్రులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆస్కార్ ఎంట్రీ దక్కించుకున్న జోష్‌తో ఉన్న చిత్ర యూనిట్, ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ వైవిధ్యమైన చిత్రాన్ని సంతోష్ దావఖర్ స్వయంగా రచించి, నిర్మించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహించారు. దావఖర్ ఫిలిమ్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా కేవలం మరాఠీ భాషకే పరిమితం కాకుండా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీ విడుదలకు సిద్ధమవుతోంది. మహారాష్ట్ర ప్రాంతపు ప్రాచీన జానపద సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణం నేపథ్యంలో ఈ కథాంశం అద్భుతంగా అల్లబడింది. భార్యాభర్తల మధ్య నెలకొన్న సంక్లిష్టమైన బంధాలు, ఒకే ఒక్క రాత్రి జరిగే అనూహ్య పరిణామాలు, ఊహించని మలుపులతో ఈ సినిమా ప్రేక్షకులను సీట్లలో కదలకుండా ఉత్కంఠకు గురిచేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గ్రామీణ మహారాష్ట్ర నేపథ్యంలో సాగే ఈ కథలో సుమన్ అనే యువతి పాత్ర ప్రధాన కేంద్రంగా నడుస్తుంది. సాగని కాపురంతో తీవ్రంగా సతమతమయ్యే ఆమె, తన దుస్థితి నుంచి బయటపడటానికి సర్జేరావు అనే ప్రేమికుడికున్న గాఢమైన భక్తిని, అలాగే పవిత్రమైన గొంధల్ ఆచారాన్ని ఏ విధంగా పావుగా వాడుకుందనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. రాత్రి సమయంలో జరిగే ఈ సాంప్రదాయక వేడుక నేపథ్యంలో గ్రామంలో దాగి ఉన్న అనేక రహస్యాలు, అధికార పోరాటాలు, నమ్మకద్రోహాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. అత్యంత పవిత్రంగా జరగాల్సిన ఒక సాంప్రదాయ కార్యక్రమం కాస్తా ఊహించని విధంగా ప్రమాదకరమైన నేరపూరిత వాతావరణంగా మారడం సినిమాలోని అసలు మలుపుగా నిలుస్తుంది.

ఈ చిత్రంలో కిషోర్ కదం, ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోని, నిషాద్ భోయిర్ మరియు అనుజ్ ప్రభు తదితర ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో నటించి అదరగొట్టారు. భావోద్వేగాలు నిజాయితీగా ఉన్నప్పుడు సినిమాకు ఎలాంటి భాషా భేదాలు అడ్డు రావని, దేశంలోని ప్రతి మూల నుంచి వచ్చే ప్రేక్షకులు ఈ ఉత్కంఠభరిత ప్రయాణాన్ని వెండితెరపై కచ్చితంగా ఆస్వాదిస్తారని దర్శకుడు సంతోష్ దావఖర్ వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.