విఆర్ఓ పై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం వినతి
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ విఆర్ఓ రామయ్య పై అవినీతి, ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని తహశల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు పాలాజీ శేఖర్, కార్యదర్శి గుర్రం డేవిడ్ రాజ్ ధర్నా చేసి అనంతరం డిప్యూటీ తాసిల్దార్ ఏకాంత్ కి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు పత్రిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ చుక్కల భూములు డీకేటి భూములు, దేవాదాయ భూములు, కుంట భూములు ,కాలువ భూములు పెత్తందారులకు దార దత్తం చేస్తున్న విఆర్ఓ రామయ్య పై ప్రభుత్వం న్యాయ విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శులు సుమన్, జాషువా, దస్తగిరి, లక్ష్మీ ప్రియ సుజాత, దస్తగిరమ్మ ,హుస్సేన్, ఓబులమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా