వలస ఓట్లపై పార్టీల అభ్యర్థులు ఆశలు
పూసపాటిరేగ, సూర్య : స్థానిక ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల గాను క్షణం తీరిక లేకుండా ప్రచారాన్ని నిర్వహించిన ఆయా పార్టీల నాయకులు వలస ఓటర్లపై ఆశలు గాలం వేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మండలంలోని జడ్పిటిసి తోపాటు 21 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో అభ్యర్థులు అస్తరశస్త్రాలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా వలస ఓటర్ల కీలకంగా మారడంతో వాటిపై ఆయా పార్టీల అభ్యర్థులు దృష్టి సారించారు. మొత్తం ఓటర్లలో 20 శాతం వరకు ఉపాధి నిమిత్తం సుదూర ప్రాంతాల్లో జీవనోపాధి సాగిస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకార ఓటర్లు గుజరాత్, హేరావాలి, ఒడిస్సా వంటి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడంతో వారిని రప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 80 శాతం వరకు అభ్యర్థుల అభ్యర్థన మేరకు స్వగ్రామాలకు చేరుకున్న వలస ఓటర్లు మిగిలిన ఓటర్లు కూడా ఎన్నికల నిర్వహణ సమయానికి చేరుకొని ఓట్లు వేస్తారు అన్న అభిప్రాయాన్ని ఆయా పార్టీల అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వలస ఓటర్లే కీలకం కావడంతో ఆ ఓటర్లు ఓట్ల సరళి పైనే విజయం సాధిస్తామన్న ధీమాను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు.