వలపర్లలో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలు
మార్టూరు, మేజర్ న్యూస్: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతి సందర్భంగా వలపర్ల గ్రామంలో కొమ్మీ మహేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి ఫౌండేషన్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నేతాజీ విద్యాసంస్థల డైరెక్టర్ సయ్యద్ కరిముల్లా, వికలాంగుల జిల్లా అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాసరావు, తెలుగు యువత వలపర్ల అధ్యక్షుడు తడికమల్లె అనిల్ కుమార్, ఎం.ఎస్.ఆర్. జూనియర్ కళాశాల లెక్చరర్ శ్రీనివాసరావు, కొమ్మీ మహేష్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన కలాం ఆశయాలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.