BREAKING
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్..

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్  మహేష్ కుమార్..

అమలాపురం.మేజర్ న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం–2026 రెండో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా జిల్లాలో పురపాలక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.బుధవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి సంబంధిత అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థిత్వాల ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై అధికారులతో చర్చించి, చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల పరిధిలో పురపాలక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ఎన్నికల విధులకు సంబంధించి అధికారులకు బాధ్యతలు కేటాయించి, ప్రతి అంశంపై ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అవసరమైన ఎన్నికల సామగ్రి, సిబ్బంది, రవాణా, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
పురపాలక ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలి.

అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరం పురపాలక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సంబంధిత మున్సిపల్ కమిషనర్లు సమగ్రంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వార్డుల వారీగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, స్ట్రాంగ్ రూములు, రూట్ మ్యాపులు, జోనల్ అధికారుల నియామకం తదితర అంశాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి మాస్టర్ ట్రైనర్ల ద్వారా అవసరమైన శిక్షణా తరగతులు నిర్వహించాలని, ఎన్నికల నియమ నిబంధనలు, విధివిధానాలపై పూర్తి అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్లకు స్పష్టం చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది విధుల కేటాయింపు వంటి అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తలెత్తే సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కరించేందుకు అమలాపురం కలెక్టరేట్‌తో పాటు అన్ని నియోజకవర్గాలు, మండలాల పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు, ఎన్నికల సిబ్బందికి ఎదురయ్యే సమస్యలు, ఏర్పాట్లలో తలెత్తే ఇబ్బందులు, ఇతర అత్యవసర అంశాలపై కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

 సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు సమన్వయంతో స్పందించి, నిబంధనలకు అనుగుణంగా సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని తెలిపారు.ఎన్నికల నిర్వహణలో వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని పేర్కొంటూ, ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు, అమలాపురం ఆర్డీవో కె. సరళాదేవి, కొత్తపేట ఆర్డీవో జి.వి.వి. సత్యనారాయణ, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్లు ఎం. నిర్మల్ కుమార్, రామరాజు, ఆర్.ఆర్. రాజు, జిల్లా పంచాయతీ అధికారి శాంతకుమారి, జిల్లా పరిషత్ సీఈవో వసంత దేవి, సీపీఓ ఎం. మురళీకృష్ణ, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారిణి పి. విజయలక్ష్మి, ఎన్నికల సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు