స్థానిక ఎన్నికలకు పటిష్టశ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భువనేశ్వరి అమ్మవారు
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు నగరంలోని మూలపేటలో వేంచేసియున్న శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆశ్వీయుజ శుద్ధ పంచమి సందర్భంగా ఉత్సవాల ఐదవ రోజైన గురువారం ఆలయంలో విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి అమ్మవారు 'శ్రీ రాజరాజేశ్వరి దేవి' అలంకారంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ప్రాకారోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులను ఆకట్టుకునేలా పద్మ చక్రవర్తి బృందం (వీణాత్రయం) నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పంచాయి.
గురువారం ఆలయంలో జరిగిన వివిధ పూజా కార్యక్రమాలకు దాతలు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఉదయం నిర్వహించిన నవావరణ పూజకు రమేష్ - పద్మజ దంపతులు ఉభయకర్తలుగా పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి జరిగిన చండీ హోమానికి రాజా శ్రావణ్ కుమార్, వారి మాతృశ్రీ కృష్ణవేణి ఉభయకర్తలుగా వ్యవహరించారు. రాత్రి జరిగిన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ, ప్రాకారోత్సవ కార్యక్రమానికి కీ.శే. ఆర్.ఆర్. నాయుడు, సుందరమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుమారులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
ఈ ఉత్సవ ఏర్పాట్లను, పూజా కార్యక్రమాలను ఆలయ చైర్మన్ అజయ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పోలీసు భద్రత