శ్రీకొండలమ్మ ఆలయ హుండీ ఆదాయం 27 లక్షల 82 వేలు
శ్రీకొండలమ్మ ఆలయ హుండీ ఆదాయం 27 లక్షల 82 వేలు
గుడ్లవల్లేరు మేజర్ న్యూస్ : కృష్ణాజిల్లా, గుడ్లవల్లేరు మండలం, వేమవరం గ్రామములో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలోని హుండీలను ఈ రోజు అనగా 05.10.2026 సోమవారం ఉదయం 9.00 గం లకు కె. శ్రీనివాస రావు, తనిఖీదారు, సూపర్వైజర్ మచిలీపట్నం వారి పరివేక్షణ లో శ్రీ అమ్మ వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మ వారి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహనరావు, సభ్యులు కళ్ళేపల్లి సుగుణ శేఖర్, మన్నెం వీర నాగేంద్రరావు, ముంగం ఆంజనేయులు, తూము రాజ్యలక్ష్మీ, నూతలపాటి లక్ష్మీ పావని, పెన్నేరు వీర వెంకట నాగ లీల శేఖర్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఆకుల కొండలరావు, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షమున తెరిచి లెక్కించగా మొత్తం 64 రోజులకు గాను నోట్లు ద్వారా రూ.25,16,520/-లు మరియు చిల్లర ద్వారా రూ.2,65,747/-/-లు వెరసి మొత్తము రూ.27,82,267/-లు మరియు అమ్మవారి అన్నదానం హుండీ ద్వార నోట్లు రూ.59,660/- మరియు చిల్లర ద్వార రూ.4,620/- వచ్చియున్నది. సదరు హుండీ లెక్కింపు కార్యక్రమములో దేవస్థానము సిబ్బంది, వుయ్యూరు, గుడ్లవల్లేరు, వేమవరం సేవా సమితి మరియు వేమవరం గ్రామస్తులు, భక్తులు తదితరలు పాల్గొన్నారు. మరియు దేవాదాయ ధర్మదాయశాఖా కమిషనర్ వారి ఆదేశాల మేరకు ది.06.10.2026 మంగళవారం ఉదయం 8.00 ల నుండి వర్షాలు సంవృధిగా పడుటకు శ్రీ అమ్మవారి సన్నిధిలో వరుణయాగం, వరుణజపం నిర్వహించబడునని ఆలయ దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహన రావు , దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండల రావు ఒక ప్రకటనలో తెలియజేసినారు.