BREAKING
కొత్తగూడెం ఏరియాలో బతుకమ్మ, ఫ్యామిలీ డే వేడుకలు అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ

శ్రమజీవులకు గౌరవప్రదమైన వేదికగా ‘శ్రమశక్తి ఉపాధి కేంద్రం’ తణుకులో రోజువారీ కార్మికుల అడ్డాను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యం

Select Suryaa Now
శ్రమజీవులకు గౌరవప్రదమైన వేదికగా ‘శ్రమశక్తి ఉపాధి కేంద్రం’  తణుకులో రోజువారీ కార్మికుల అడ్డాను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ  కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యం

తణుకు, సూర్య న్యూస్ : సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రమజీవులకు గౌరవప్రదమైన వాతావరణం కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు పట్టణంలోని కప్పల వెంకన్న సెంటర్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ‘శ్రమశక్తి ఉపాధి కేంద్రం–రోజువారీ కార్మికుల అడ్డా’ను బుధవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాదాకృష్ణ మాట్లాడుతూ రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కూలీల శ్రమకు సముచిత గుర్తింపు దక్కాలని అన్నారు. నిత్యం ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి తరలివచ్చే కార్మికులు తమ పనుల కోసం రహదారుల పక్కన వేచి ఉండాల్సిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్మికులు ఒకేచోట అందుబాటులో ఉండటం వల్ల పనులు కల్పించేవారికి కూడా సౌలభ్యం ఏర్పడుతుందన్నారు.

కార్మికుల శ్రమే సమాజ పురోగతికి పునాదని, వారి సంక్షేమం సామాజిక బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలతో పాటు కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా సౌకర్యాలు కల్పించడం అవసరమన్నారు. శ్రమశక్తి ఉపాధి కేంద్రం రోజువారీ కార్మికులకు ఉపయోగకరమైన వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, రోజువారీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్.:.అనుకుమార్ ..పశ్చిమగోదావరి జిల్లా.