BREAKING
వివేకా హత్య, లిక్కర్ స్కామ్‌పై సమాధానం చెప్పే ధైర్యం ఉందా ? సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ అక్రమ ఇసుక రవాణాపై పంజా , రెండు టిప్పర్ల పట్టివేత : ఎస్సై ఎస్.ఎం. నవీద్ వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ యూరియా అందించాలి గ్లోబల్ వార్మింగ్‌ను నివారించే కీలక మార్గాన్ని విస్మరిస్తున్న ప్రపంచ దేశాలు వైసీపీ నాయకులకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి. వైద్య రంగంలో 2026 నోబెల్ మెడిసిన్ విజేతలుగా డీసర్‌రోత్, హెగెమాన్, నాజెల్

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు గోగినేనిపాలెం హైస్కూల్ బాలికలు

Select Suryaa Now
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు గోగినేనిపాలెం హైస్కూల్ బాలికలు

ఘంటసాల మేజర్ న్యూస్ :-

కృష్ణాజిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్‌లో గోగినేనిపాలెం శ్రీ ఎన్.జి.రంగా జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన ముగ్గురు బాలికలు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. దీంతో పాఠశాలలో సోమవారం అభినందన సభ నిర్వహించారు.

పమిడిముక్కల మండలం తాడంకి హైస్కూల్‌లో నిర్వహించిన 52వ జిల్లా స్థాయి జూనియర్స్ బాలబాలికల కబడ్డీ సెలక్షన్స్‌లో 9వ తరగతి విద్యార్థిని పెనుమత్స యామినీకుమారి బాలికల జిల్లా జట్టుకు ఎంపికైంది.

అదేవిధంగా పమిడిముక్కల మండలం అగ్నిపర్రు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహించిన 36వ జిల్లా స్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల కబడ్డీ సెలక్షన్స్‌లో 10వ తరగతి విద్యార్థిని లోకం లహరి జిల్లా జట్టుకు ఎంపిక కాగా, 9వ తరగతి విద్యార్థిని గారపాటి జాహ్నవి స్టాండ్‌బైగా ఎంపికైంది.

జిల్లా జట్టుకు ఎంపికైన విద్యార్థినులు లోకం లహరి, పెనుమత్స యామినీకుమారి, స్టాండ్‌బైగా ఎంపికైన గారపాటి జాహ్నవి, వారికి శిక్షణ అందించిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ అప్పికట్ల రామారావులను పాఠశాల ప్రధానోపాధ్యాయిని లంకే కృష్ణకుమారి, ఎస్‌ఎంసీ చైర్మన్ కుంపటి శ్రీలక్ష్మి, ఉపాధ్యాయ కార్యదర్శి మురాల పిచ్చేశ్వరరావు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు అత్తులూరి గోపీచంద్, మల్లంపాటి పిచ్చేశ్వరరావు, గుత్తికొండ సుభాష్ చంద్రబోస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు అభినందించారు.

ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ అప్పికట్ల రామారావు మాట్లాడుతూ, 36వ సబ్‌జూనియర్స్ బాలబాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఏలూరు జిల్లా నూజివీడులో జరుగుతాయని తెలిపారు. అలాగే 52వ జూనియర్స్ బాలబాలికల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ నెల 16, 17, 18 తేదీల్లో మార్కాపురంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

గోగినేనిపాలెం పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.