BREAKING
ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ...ఓటరు నమోదు అధికారి ఈ వెంకట్ రెడ్డి అగ్రికల్చర్ విద్యార్థునీల విద్య క్షేత్ర పర్యటన... పోస్టల్ బ్యాంక్ ఖాతాలో పెన్షన్ డిబిటి నగదు జమ... దుగరాజపట్నంలో షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలన రీ సర్వే అభ్యంతరాల పై సమావేశం.... ఎంఈఓ పనితీరుపై ఎంపీడీవో కు యుటిఎఫ్ నాయకులుఫిర్యాదు డి-పట్టా రైతులకు న్యాయం చేయాలి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి 24 గంటలు పనిచేయని ఆసుపత్రి ఆర్ఈసీఎస్ లో ఏం జరుగుతుందో? ఆనంద్ బ్రహ్మ అకాడమీ ద్వారా విద్యార్థులు కు ఉచిత శిక్షణ: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల పరిశీలన సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం:

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బలిజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి- బొబ్బేపల్లి సురేష్ నాయుడు

Select Suryaa Now
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బలిజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి- బొబ్బేపల్లి సురేష్ నాయుడు

గూడూరు -: సర్వేపల్లి: పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పవన్ కళ్యాణ్‌పై, బలిజ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు డిమాండ్ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు.పేదలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బొబ్బేపల్లి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తాగునీటి పథకాలకు సంబంధించిన నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనులు పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పేదలకు తాగునీరు అందించేందుకు నిధులు సాధించారని చెప్పారు.
రాయలసీమ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గతంలో నిలిచిపోయిన పనులను పూర్తిచేసి, తాగునీరు అందని ప్రతి ప్రాంతానికి స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో ‘అమరజీవి జలధార’ పథకాన్ని చేపట్టారని తెలిపారు.
అయితే అనంతపురం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించడాన్ని రాజకీయ కోణంలో విమర్శిస్తూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావని బొబ్బేపల్లి అన్నారు.“ఆ ప్రాంతంలో బలిజలు ఎక్కువగా ఉన్నారని, అందుకే అక్కడ తాగునీటి పథకం ప్రారంభించారంటూ మాట్లాడటం కులాలను రెచ్చగొట్టే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన అందరివాడు” అని బొబ్బేపల్లి పేర్కొన్నారు.
రైతులు, యువత, పేదలు, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. అలాంటి నాయకుడిపై కుల ప్రస్తావనలతో విమర్శలు చేయడం తగదన్నారు.
నీ గెలుపులో అన్ని కులాల ఓట్లు ఉన్నాయిరాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాజకీయ చరిత్రను గుర్తు చేస్తూ బొబ్బేపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకే సామాజిక వర్గం ఓట్లతో ఆయన రాజకీయంగా ఎదగలేదని, అన్ని వర్గాల ప్రజల ఆదరణతోనే ఎన్నికల్లో విజయం సాధించారని అన్నారు.
1998లో కౌన్సిలర్‌గా, 2003లో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా, 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, 2019లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించింది అన్ని వర్గాల ప్రజలేనని ఆయన అన్నారు.

సనాతన ధర్మాన్ని చులకనగా చూడొద్దు

హిందువులు, హిందూ ధర్మం, సనాతన ధర్మంపై వైసీపీ నాయకులు చులకనగా మాట్లాడటం సరికాదని బొబ్బేపల్లి విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలే వైసీపీకి ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయని అన్నారు.
2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైందని, అయినప్పటికీ ఆ పార్టీ నాయకుల వైఖరిలో మార్పు కనిపించడం లేదని విమర్శించారు. నాయకుల నోటి దూకుడే పార్టీ పతనానికి ప్రధాన కారణమవుతోందని అన్నారు.
“పవన్ కళ్యాణ్‌ను విమర్శించేముందు ఆయన రాష్ట్రం కోసం చేస్తున్న సేవలను చూడాలి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడటం మానుకోవాలి. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్‌కు, ఆంధ్ర రాష్ట్ర బలిజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి” అని బొబ్బేపల్లి సురేష్ నాయుడు డిమాండ్ చేశారు