BREAKING
హత్య కేసులో భార్యాభర్తలు అరెస్ట్ --స్మార్ట్‌ఫోన్ స్వాధీనం ఆసియా పతక విజేతలతో ప్రధాని మోడీ సమావేశం మేడ్చల్ డిపో TJMU ఘన విజయం.. గౌరవ అధ్యక్షుడిగా జగన్ గౌడ్, సెక్రటరీగా శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం.. క్రమశిక్షణ, కష్టం తోలినాళ్ల నుంచి అగ్రస్థానం వరకు! ముంబైలో లగ్జరీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకిచ్చిన సైఫ్ అలీ ఖాన్.. ప్రతినెలా భారీగా వస్తున్న అద్దె! కొలిక్కి వస్తున్న సీట్ల సర్దుబాటు ఎన్నికల పరిశీలకులుగా 28 మంది ఐఏఎస్‌ల నియామకం మొలకెత్తిన గింజలు తింటే నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?.. వీటిని తినే సరైన విధానం ఇదే! పిల్లలు మొబైల్ ఫోన్‌కు ఎందుకు బానిసలవుతున్నారు?.. తల్లిదండ్రులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! మల్లారెడ్డిగూడెంకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. స్పీకర్‌కు సర్పంచ్ వినతి స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపుకు కృషి చేయండి చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో ' మీసాల ' ? .....పోటీ ' బెల్లాన వర్సెస్ మీసాల' కానుందా?.... అక్రమంగా అమర్చిన 12 మోటార్లు స్వాధీనం డాక్టర్ బి.వి. రాజు 106వ జయంతి.. ఘనంగా సేవా కార్యక్రమాలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఈ మార్పులు తప్పనిసరి.. ప్రశాంతమైన వాతావరణం కోసం ఇవి చేయండి!

ప్రపంచ విద్యార్థి దినోత్సవం సందర్భంగా వృద్ధులకు అన్నదానం.. నిత్యావసర వస్తువుల పంపిణీ

Select Suryaa Now
ప్రపంచ విద్యార్థి దినోత్సవం సందర్భంగా వృద్ధులకు అన్నదానం.. నిత్యావసర వస్తువుల పంపిణీ

మార్టూరు, మేజర్ న్యూస్:

ప్రపంచ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకుని వలపర్ల హైస్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు తానికొండ రత్నకుమార్ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అమ్మ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేయడంతో పాటు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వృద్ధులకు సబ్బులు, టూత్‌పేస్టులు, బ్రష్‌లు, కొబ్బరి నూనె, షాంపూలు, అద్దాలు, దువ్వెనలు, స్వీట్లు, పండ్లు అందజేశారు. వృద్ధుల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
గతంలోనూ పలుమార్లు అమ్మ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేయడంతో పాటు అవసరమైన వస్తువులను అందజేస్తూ సేవాభావాన్ని చాటుకుంటున్న తానికొండ రత్నకుమార్‌కు ఆశ్రమ అధ్యక్షుడు గుంటుపల్లి చందు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వం, సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.