పొన్నూరు లో ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు
పొన్నూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం భారతరత్న భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను కొనియాడారు .సాధారణ కుటుంబంలో జన్మించి, కృషి, పట్టుదల, అపారమైన ప్రతిభతో దేశ అత్యున్నత పదవిని అలంకరించిన కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు విద్య, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ఉన్నత లక్ష్యాలనునిర్దేశించుకోవడం ద్వారా జీవితంలో గొప్ప విజయాలను సాధించవచ్చని ఆయన తన జీవిత ప్రయాణం ద్వారా నిరూపించారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనన్నారు
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్