BREAKING
ధరల స్థిరత్వమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం: తేల్చిచెప్పిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్! అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్: విస్తృత ప్రచారం షురూ.. నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి!

పాలకొల్లులో వైసీపీకి మరో షాక్‌ మాజీ ఎంపీపీ చిట్టూరి కనకలక్ష్మి, మాజీ ఎంపీటీసీ చిట్టూరి ఏడుకొండలు టీడీపీలో చేరిక.

Select Suryaa Now
పాలకొల్లులో వైసీపీకి మరో షాక్‌  మాజీ ఎంపీపీ చిట్టూరి కనకలక్ష్మి, మాజీ ఎంపీటీసీ చిట్టూరి ఏడుకొండలు టీడీపీలో చేరిక.

పాలకొల్లు, మేజర్ న్యూస్: నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాలకొల్లు మండల మాజీ ఎంపీపీ చిట్టూరి కనకలక్ష్మి, మాజీ ఎంపీటీసీ చిట్టూరి ఏడుకొండలుతో పాటు పలువురు నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం పాలకొల్లులోని మంత్రి కార్యాలయం వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో వారు పసుపు కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కనకలక్ష్మి, ఏడుకొండల దంపతులను మంత్రి పార్టీ కండువాలు కప్పి సత్కరించారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మంత్రి నిమ్మల రామానాయుడు పనితీరుకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు ఏడుకొండలు తెలిపారు. వైసీపీలో సుమారు 16 ఏళ్లపాటు పనిచేసినా తగిన గుర్తింపు లభించలేదని, ఆక్వా వ్యాపారంలోనూ ఆర్థికంగా నష్టపోయానని పేర్కొన్నారు. తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు, పాలకొల్లు అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషిని గుర్తించి టీడీపీలో చేరినట్లు వెల్లడించారు. పార్టీ సీనియర్‌ నాయకులు, కూటమి శ్రేణులను కలుపుకొని పనిచేస్తానన్నారు.

మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, వైసీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన కనకలక్ష్మి, ఏడుకొండల దంపతులు టీడీపీలో చేరడం సంతోషకరమన్నారు. పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు గత రెండున్నరేళ్లలో కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు సాధించి గ్రామాలు, పట్టణ వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని, కూటమి ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై వైసీపీ నాయకులు టీడీపీలో చేరడం శుభపరిణామమని అన్నారు.మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ మాట్లాడుతూ, వైసీపీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించలేదని, ఆర్థికంగా నష్టపోయిన ఏడుకొండలు దంపతులు టీడీపీలో చేరడం సమంజసమన్నారు. కనకలక్ష్మి మాట్లాడుతూ, తాను ఎవరినీ విమర్శించదలచుకోలేదని, వైసీపీలో తగిన గౌరవం లభించకపోవడంతో పాటు ఎంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల చింతపర్రు గ్రామంలో 50కిపైగా కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన నేపథ్యంలో, తాజాగా కనకలక్ష్మి, ఏడుకొండల దంపతుల చేరిక పాలకొల్లు రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో పాలకొల్లు టీడీపీ అధ్యక్షుడు పాముల రజనీకుమార్‌, నాయకులు మేడిది డేవిడ్‌ జాన్‌రాజు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, మామిడిశెట్టి పెద్దిరాజు, కడల్‌ గోపాలరావు, ఆరుమిల్లి చిన్ని, బోనం నాని, పొట్నూరి శ్రీనివాస్‌, బిరుదుకోట శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.